‘‘పవన్ కామెంట్స్ నే.. ఇమ్రాన్ ప్రస్తావించారు’’

Published : Mar 02, 2019, 10:40 AM IST
‘‘పవన్ కామెంట్స్ నే.. ఇమ్రాన్ ప్రస్తావించారు’’

సారాంశం

యుద్ధం గురించి పవన్ కళ్యాణ్, కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప చేసిన కామెంట్స్ ని పార్లమెంట్ లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారని చంద్రబాబు అన్నారు.

యుద్ధం గురించి పవన్ కళ్యాణ్, కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప చేసిన కామెంట్స్ ని పార్లమెంట్ లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారని చంద్రబాబు అన్నారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ భారత్-పాక్ యుద్ధం గురించి మాట్లాడుతూ.. యుద్ధం జరుగుతుందని తనకు రెండు సంవత్సరాల క్రితమే తెలుసునని.. తనకు బీజేపీనేతలే చెప్పారంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. వీటిని కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ వేదికగా ప్రస్తావించి బీజేపీ నేతలపై మండిపడ్డారు. పాక్ మీడియా కూడా పవన్ కామెంట్స్ ని హైలెట్ చేస్తూ రాయడం  విశేషం.

ఇక యడ్యూరప్ప అయితే.. పాక్ స్థావరాలపై భారత్ దాడి.. తమకు ఎన్నికల్లో ఉపయోగపడుతుందంటూ కామెంట్స్ చేశారు. ఈ ఎఫెక్ట్ తో కర్ణాటకలో 20 పార్లమెంట్ స్థానాలు బీజేపీకి దక్కుతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలు కూడా వివాదాస్పదమయ్యాయి.

కాగా.. ఈ రెండింటిని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్ గురించి ప్రస్తావిస్తూ.. వీరిద్దరి కామెంట్స్ ని ప్రస్తావించారు. కాగా..దీనిని చంద్రబాబు ఈ రోజు గుర్తు చేశారు. తమ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ..  కేంద్రంలోని అధికార బీజేపీపై మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

కడుపుకి గడ్డి తింటున్నావా సీఎం చంద్రబబుపై జగన్ సంచలన కామెంట్స్| YS Jagan Presmeet at Srikakulam
సీఎం చంద్రబబుపై జగన్ సంచలన కామెంట్స్ | YS Jagan Strong Attack on Chandrababu