ఇటీవల ప్రారంభం.. కూలిన ఏపీ హైకోర్టు గోడ

Published : Mar 02, 2019, 11:20 AM IST
ఇటీవల ప్రారంభం.. కూలిన ఏపీ హైకోర్టు గోడ

సారాంశం

ఇటీవల ఏపీలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

ఇటీవల ఏపీలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా.. భవనం ప్రారంభించి.. కేవలం రెండు నెలలకే.. దాని పరిస్థితి అద్వాన్నంగా మారింది. జనరేటర్‌కు సంబంధించి నిర్మాణంలో ఆరు గదుల్లో రెండు గదుల స్లాబ్‌ కూలింది. 

ఈ సంఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిని తాడేపల్లి సమీపంలోని ఎన్‌ఆర్ఐకి ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం పనులు చేస్తుండగా గోడ కూలినట్లు కార్మికులు తెలిపారు. కార్మికులంతా జార్ఖండ్‌కు చెందినవారు.  అయితే ఈ సంఘటనను మీడియా ప్రతినిధులు చిత్రీకరించేందుకు వెళ్లగా, వారిని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP