
విశాఖపట్టణం: మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీలో చేరనున్నారు. ఈ నెల 9వ తేదీన దాడి వీరభద్రరావు వైసీపీలో చేరుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్ విశాఖ సిటీ నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాడి వీరభద్రరావు టీడీపీ నుండి వైసీపీలో చేరారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు విశాఖ జిల్లాలో పాదయాత్ర ముగించిన కొన్ని రోజులకే దాడి వీరభద్రరావు టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
2014 ఎన్నికల తర్వాత దాడి వీరభద్రరావు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీని వీడే సమయంలో దాడి ఆ పార్టీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరనున్నారు.
ఈ నెల 17వ తేదీన కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరనున్నారు. కొణతాల రామకృష్ణకు దాడి వీరభద్రరావు మధ్య చాలా కాలంగా వైరం ఉంది.2014 ఎన్నికలకు ముందు వీరిద్దరూ కూడ వైసీపీలో కొనసాగారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ నేతలు కూడ వైసీపీని వీడారు..