మోడీ, కేసీఆర్ అండతో జగన్ రెచ్చిపోతున్నాడు: చంద్రబాబు

Published : Mar 07, 2019, 11:36 AM IST
మోడీ, కేసీఆర్ అండతో జగన్ రెచ్చిపోతున్నాడు: చంద్రబాబు

సారాంశం

మోడీ, కేసీఆర్ ‌అండతో జగన్ రెచ్చిపోతున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. వైసీపీ కాల్ సెంటర్ నుండి ఫోన్లు చేస్తే తమ నెంబర్లు ఎవరిచ్చారంటూ నిలదీయాలని  బాబు పార్టీ నేతలకు సూచించారు.

అమరావతి:  మోడీ, కేసీఆర్ ‌అండతో జగన్ రెచ్చిపోతున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. వైసీపీ కాల్ సెంటర్ నుండి ఫోన్లు చేస్తే తమ నెంబర్లు ఎవరిచ్చారంటూ నిలదీయాలని  బాబు పార్టీ నేతలకు సూచించారు.

గురువారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టెలికాన్పరెన్స్‌లో మాట్లాడారు.తొలి దశలో రాష్ట్రంలో 13 లక్షల ఓట్లను తొలగించేందుకు వైసీపీ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. అయితే  ఈ కుట్రపై సకాలంలో స్పందించడంతో జగన్ ప్లాన్ అమలు కాలేనది బాబు  పార్టీ నేతలకు వివరించారు. 

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏ రకంగా ఓట్లను తొలగించిందో  అదే పద్దతిని  ఏపీలో కూడ వైసీపీ అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు.  గతంలో  రాష్ట్రంలోని 59 లక్షల ఓట్లను తొలగింపు కుట్రకు జగన్ సూత్రధారి అంటూ  ఆయన విమర్శించారు.

దేశంలోని పలు రాజకీయ పార్టీలకు యాప్‌లు ఉన్నాయనే విషయాన్ని బాబు గుర్తు చేశారు.  అయితే  టీడీపీ  యాప్‌పైనే ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రెండు వేల మంది వైసీపీ కార్యకర్తలు సుమారు 8 లక్షల ఓట్లను తొలగించాలని కోరుతూ ఫారం-7 ధరఖాస్తులు చేసిన విషయాన్ని బాబు గుర్తు చేశారు.

ఏపీలో ఓట్ల తొలగింపు వెనుక మూడు పార్టీల కుట్ర ఉందని  బాబు ఆరోపించారు. డ్వాక్రా సంఘాల్లోని సభ్యులకు మహిళా దినోత్సవం సందర్భంగా  ఆ గ్రూపు సభ్యుల ఖాతాల్లో  రూ. 3500 జమ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. మిగిలిన రూ.4 వేలను తర్వాత చెల్లించనున్నట్టు బాబు వివరించారు. 

జగన్‌ మాయా రాజకీయం మన రాష్ట్రంలో చెల్లదన్నారు. హైదరాబాద్‌లో తమపై కేసులు పెట్టిస్తున్నారని, తమ డేటా దొంగిలించి ఓట్లు వేయాలని తమకే ఫోన్లు చేస్తున్నారని తప్పుపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Flags Off Vehicles to Lok Bhavan | Crore Signatures Paper Transfer | Asianet News Telugu
BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu