ఎమ్మెల్సీ ఎన్నికలు: ఎన్జీవో నేత ఆశోక్‌బాబుకు బాబు బంపరాఫర్

By narsimha lodeFirst Published Feb 27, 2019, 12:25 PM IST
Highlights

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం నాడు చివరి తేదీ కావడంతో టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. 

అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం నాడు చివరి తేదీ కావడంతో టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇంతవరకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. చంద్రబాబునాయుడు ఢిల్లీలో జరిగే విపక్షపార్టీల సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ రాత్రికి ఎమ్మెల్సీ అభ్యర్థులను బాబు ఖరారు చేసే ఛాన్స్ ఉంది.

ఏపీ రాష్ట్రంలో  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ  పదవులు ఐదింటికి మార్చి 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.  అయితే ఈ ఎన్నికల్లో టీడీపీకి నాలుగు స్థానాలు దక్కనున్నాయి. వైసీపీకి ఒక్క స్థానం దక్కనుంది.

వైసీపీ తరపున బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తిని ఆ పార్టీ బరిలోకి దింపింది. టీడీపీ తరపున ఇంకా అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకు ఎమ్మెల్సీ పదవి ఖరారైంది. ఉద్యోగ సంఘాల నుండి ఏపీ ఎన్‌జీఓ నేత ఆశోక్‌బాబుకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.

మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడి కొడుకుకు కూడ ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం లేకపోలేదు. మిగిలిన ఒక్క స్థానంతో పాటు గవర్నర్ కోటాలో మరో ఇద్దరికి ఛాన్స్ దక్కనుంది. ఈ స్థానాల కోసం టీడీపీలో పోటీ తీవ్రంగా నెలకొంది.

అజీజ్, వర్ల రామయ్య, జూపూడి ప్రభాకర్, పంచుమర్తి అనురాధ, బుట్టా రేణుక, గాదె వెంకట్ రె్డి, సబ్బం హరి, కోనేరు సురేష్‌లు పోటీ పడుతున్నారు.  అయితే చంద్రబాబునాయుడు ఎవరిని ఫైనల్ చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు ఢిల్లీ నుండి బాబు తిరిగి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

click me!