చంద్రబాబుకు తలనొప్పి: మంత్రి జవహర్‌కు అసమ్మతి సెగ

Published : Feb 27, 2019, 12:10 PM IST
చంద్రబాబుకు తలనొప్పి: మంత్రి జవహర్‌కు అసమ్మతి సెగ

సారాంశం

 ఏపీ మంత్రి జవహర్‌కు స్వంత పార్టీలోనే నిరసనలు మిన్నంటుతున్నాయి. మంత్రి వ్యతిరేక వర్గం బుధవారం నాడు కొవ్వూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అవినీతిపరుడైన మంత్రి తమకు వద్దంటూ నినాదాలు చేశారు


కొవ్వూరు: ఏపీ మంత్రి జవహర్‌కు స్వంత పార్టీలోనే నిరసనలు మిన్నంటుతున్నాయి. మంత్రి వ్యతిరేక వర్గం బుధవారం నాడు కొవ్వూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అవినీతిపరుడైన మంత్రి తమకు వద్దంటూ నినాదాలు చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి వ్యతిరేక వర్గం కొంత కాలంగా బహిరంగంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో మంత్రి జవహర్ పార్టీలోని అందరిని కలుపుకు పోవడం లేదని వైరి వర్గం ఆరోపణలు చేస్తోంది. పార్టీకి చెందిన ముఖ్య నేత  నేతృత్వంలో  మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

మంత్రిగా ఉన్న జవహర్ పార్టీలో గ్రూపులను పెంచిపోషిస్తున్నాడని ప్రత్యర్థి వర్గం ఆరోపణలు చేస్తోంది.ఇవాళ కొవ్వూరులో మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా వైరివర్గం భారీ బైక్ ర్యాలీని నిర్వహించి మంత్రి వర్గీయులను షాక్ గురి చేసింది.బాబు నిన్నే నమ్ముతాం, అవినీతి పరులను  నమ్మం అంటూ జవహర్‌కు వ్యతిరేకంగా వైరి వర్గం నినాదాలు చేశారు.  

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్