టీడీపీలోకి కోట్ల.. బుట్టా రేణుక ఏమన్నారంటే...

Published : Feb 27, 2019, 11:06 AM IST
టీడీపీలోకి కోట్ల.. బుట్టా రేణుక ఏమన్నారంటే...

సారాంశం

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. త్వరలో టీడీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. 


కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. త్వరలో టీడీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోట్ల  ఈ విషయాన్ని మీడియా ముఖంగా ప్రకటించేశారు. అయితే.. కోట్ల టీడీపీలో చేరితే..బుట్టా రేణుకు సీటుకి ఎసరు వచ్చినట్లేననే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. కోట్ల టీడీపీ చేరికపై తాజాగా బుట్టా రేణుక స్పందించారు.

బుధవారం బుట్టా రేణుక శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ... కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబం టీడీపీలో చేరికపై నాకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అలాగే టికెట్ల కేటాయింపుపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. నాకు ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుందన్నారు. కాగా... అమరజవాన్ల కుటుంబాలు ధైర్యంగా, క్షేమంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని ఎంపీ రేణుక అన్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్