ఏపీ ప్రభుత్వం డేటా చోరీ.. హైదరాబాద్ లో కేసు

By ramya NFirst Published Mar 2, 2019, 2:38 PM IST
Highlights

ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారుల డేటా మొత్తం చోరికి గురైంది. 


ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారుల డేటా మొత్తం చోరికి గురైంది. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా ఇప్పుడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీ చేతిలో ఉండటం గమనార్హం. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు సోదాలు చేపడుతున్నారు.

వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఈ మేరకు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లూ ఫ్రాగ్ మొబైల్స్ టెక్నాలజీ కంపెనీపై కేసు నమోదు చేసి, కూకట్‌పల్లిలోని ఆ సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 

ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓటర్ కార్డు, ఆధార్ కార్డులు ఆ కంపెనీలో ఉన్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఆ కంపెనీకి చెందిన రెండు ప్రధాన కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

click me!