కేటీఆర్, వైఎస్ జగన్ రహస్య భేటీ, చేతులు మారిన డబ్బు : ఏపీ మంత్రి జవహర్ సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Mar 6, 2019, 7:21 PM IST
Highlights

జగన్, కేటీఆర్ భేటీలో పెద్ద మెుత్తంలో నగదు చేతులు మారిందని ఆరోపించారు. జగన్, కేటీఆర్ ల భేటీని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏర్పాటు చేశారంటూ చెప్పుకొచ్చారు. డేటా చోరీ కుట్రలో గవర్నర్ నరసింహన్ కుట్ర కూడా ఉందన్నారు. గవర్నర్ వ్యవస్థను మోదీ దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శించారు. 

అమరావతి: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి జవహర్. మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ రహస్య ప్రదేశంలో కేటీఆర్, జగన్ సమావేశమయ్యారని స్పష్టం చేశారు. ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన జవహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

జగన్, కేటీఆర్ భేటీలో పెద్ద మెుత్తంలో నగదు చేతులు మారిందని ఆరోపించారు. జగన్, కేటీఆర్ ల భేటీని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏర్పాటు చేశారంటూ చెప్పుకొచ్చారు. డేటా చోరీ కుట్రలో గవర్నర్ నరసింహన్ కుట్ర కూడా ఉందన్నారు. గవర్నర్ వ్యవస్థను మోదీ దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శించారు. 

చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని బీజేపీ నేతలు గవర్నర్ ను కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. మరోవైపు టీడీపీ గెలిచే నియోజక వర్గాల్లో ఓట్లు తొలగిస్తున్నారని మంత్రి జవహర్ ఆరోపించారు. 

ఈ విషయాన్ని జగన్ బహిరంగంగా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అప్రదిష్టపాలు చేసేలా జగన్ వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. దొంగఓట్లు అనే నేపంతో జగన్ ఫామ్ 7ను దుర్వినియోగం చేశారని ఆయనపై కేసులు నమోదు చెయ్యాలని మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. 
 
click me!