నా పిల్లల్లో ఇద్దరు క్రైస్తవులు, ఇద్దరు హిందువులు: పవన్

By Nagaraju penumalaFirst Published Mar 6, 2019, 6:42 PM IST
Highlights

తన నలుగురు బిడ్డలలో ఇద్దరు క్రిస్టియన్లు అయితే మరో ఇద్దరు హిందూత్వాన్ని అనుసరిస్తారన్నారు. తన సన్నిహితులు ఇస్లాంను అనుసరిస్తారని చెప్పుకొచ్చారు. రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా అందరికి అండగా ఉంటుందని, అదే స్ఫూర్తితో తాను ప్రజలకు అండగా నిలవాలనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. 

విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదని చెప్పుకొచ్చారు. వన్ కళ్యాణ్ అంటే నాయుడు కాదు, రెడ్డి కాదు, రాయల్ కాదని చెప్పుకొచ్చారు. తన పేరు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమేనని తన పేరు వెనుక కానీ ముందుకానీ తన కులం ఉండదన్నారు. 

పవన్ కళ్యాణ్ పేరు వెనుక రెడ్డి, నాయుడు ఉండవన్నారు. రాయ్ కూడా ఉండదని చెప్పుకొచ్చారు. తాను కులాలను విడగొట్టి రాజకీయాలు చేయడానికి రాలేదని కులాలను కలిపేందుకు వచ్చానని స్పష్టం చేశారు. మనం ఎవరికి పుట్టాలి, ఎలా పుట్టాలి అనేది మన చేతుల్లో లేదని భగవంతుడు సృష్టి అన్నారు. 

ఇటీవలే కర్నూలు బహిరంగ సభలో తాను రెడ్డి సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలను పవన్ గుర్తు చేశారు. రెడ్డి అంటే రక్షించేవాడని దోపిడీ చేసేవాడు కాదని చెప్పానని మరుసటి రోజు రెడ్డి సామాజిక వర్గం ప్రతినిధులు వచ్చి తన దగ్గర సంతోషం వ్యక్తం చేశారన్నారు. తనకు కులం, మతం గురించి పట్టింపులు ఉండవన్నారు. 

తాను అందరివాడినని చెప్పుకొచ్చారు. తన నలుగురు బిడ్డలలో ఇద్దరు క్రిస్టియన్లు అయితే మరో ఇద్దరు హిందూత్వాన్ని అనుసరిస్తారన్నారు. తన సన్నిహితులు ఇస్లాంను అనుసరిస్తారని చెప్పుకొచ్చారు. రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా అందరికి అండగా ఉంటుందని, అదే స్ఫూర్తితో తాను ప్రజలకు అండగా నిలవాలనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. 
ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో కొత్త విప్లవం మెుదలైందని స్పష్టం చేశారు. ఆ విప్లవం తుపాకులతో, కత్తులతో చేసేదది కాదన్నారు. ఆ విప్లవం మార్పుకోసం మెుదలైన ఒక నిశబ్ధ విప్లవం అంటూ చెప్పుకొచ్చారు.  

click me!