విశాఖ జోన్ మాయా జోన్, మోడీ పర్యటన ఓ కుట్ర: చంద్రబాబు

Siva Kodati |  
Published : Mar 01, 2019, 10:27 AM IST
విశాఖ జోన్ మాయా జోన్, మోడీ పర్యటన ఓ కుట్ర: చంద్రబాబు

సారాంశం

విశాఖ పర్యటనకు ప్రధాని రావడం వెనుక మరో కుట్ర ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. శుక్రవారం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ధర్మపోరాట నిరసనలు చేపట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

విశాఖ జోన్ ఓ మాయా జోన్‌గా ఆయన అభివర్ణించారు. బీజేపీ రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. ఐదు, ఆరు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఆయన స్పస్టం చేశారు.

రాజకీయాల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని ముఖ్యమంత్రి హితవు పలికారు. యాడ్యూరప్ప వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని, యుద్ధం గురించి రెండేళ్ల క్రితమే చెప్పారన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. బీజేపీ దుర్మార్గ రాజకీయాలను ఖండించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు