బాలయ్య ‘మహానాయకుడు’ పై చంద్రబాబు కామెంట్స్

By Siva KodatiFirst Published Feb 28, 2019, 3:12 PM IST
Highlights

తెలుగుదేశం  పార్టీ వ్యవస్ధాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వచ్చిన సంగతి తెలిసిందే. 

తెలుగుదేశం  పార్టీ వ్యవస్ధాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి భాగంలో ఆయన సినీ జీవితాన్ని ఆవిష్కరిస్తూ ‘కధానాయకుడు’, రెండవ భాగంలో ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం, నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటును కథాంశంగా తీసుకున్నారు.

ఇటీవల రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ను అంతగా సంతృప్తిపరచలేదు. ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్‌ను రానా దగ్గుబాటి పోషించారు. తాజాగా ‘మహానాయకుడు’ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.

అమరావతిలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రేషన్ డీలర్లందరూ మహానాయకుడు చూడాలని తద్వారా తాము పేదలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామో తెలుస్తుందన్నారు.

రేషన్ డీలర్లకు ఐదు రెట్లు కమీషన్ పెంచామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో రేషన్ షాపులు మినీ సూపర్‌బజార్‌లుగా మారాలని సీఎం ఆకాంక్షించారు. ఎమ్మెస్ఎన్వీ పార్కుల ద్వారా లోకల్ సరుకులు విదేశాలకు పంపిస్తామని చంద్రబాబు వెల్లడించారు. బియ్యం ధర రూపాయి ఉంటే.. డీలర్‌కు ఇచ్చే కమీషన్ కూడా రూపాయి ఇస్తున్నామన్నారు. 

click me!