డేటా చోరీ: తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసుల కేసు

By narsimha lodeFirst Published Mar 7, 2019, 11:57 AM IST
Highlights

: తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ రాష్ట్రంలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో  పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డేటా చోరీ చేశారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు, మంత్రులు  ఫిర్యాదు చేయడంతో  ఈ కేసును నమోదు చేశారు.


గుంటూరు: తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ రాష్ట్రంలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో  పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డేటా చోరీ చేశారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు, మంత్రులు  ఫిర్యాదు చేయడంతో  ఈ కేసును నమోదు చేశారు.

ఐటీ గ్రిడ్‌ సంస్థపై తెలంగాణ రాష్ట్రంలో కేసులు నమోదయ్యాయి. ఈ విషయమై విచారణకు తెలంగాణ సర్కార్ సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో తమ డేటాను తెలంగాణ సర్కార్ చోరీ చేసిందని  ఏపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఇదే విషయమై టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు బుధవారం సాయంత్రం తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేతలతో పాటు తెలంగాణ పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

120బీ, 410, 429, 380, 409, 167,177, 180 బీ సెక్షన్లపై కేసు నమోదు  చేశారు. ఈ కేసును విచారిస్తున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. ఐటీ గ్రిడ్ సంస్థ కేంద్రంగా ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో పెట్టిన కేసులకు కౌంటర్‌గా ఏపీలో  కేసులు నమోదు చేసినట్టుగా  రాజకీయ  విశ్లేషకులు భావిస్తున్నారు.
 

click me!