టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి.. ప్రమాణస్వీకారం

Published : Jun 22, 2019, 12:10 PM IST
టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి.. ప్రమాణస్వీకారం

సారాంశం

తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షునిగా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బా రెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను టీటీడీ ఛైర్మన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షునిగా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బా రెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను టీటీడీ ఛైర్మన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి డిప్యుటీ సీఎం నారాయణ స్వామి, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. వైవీ సుబ్బారెడ్డి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఉదయమే స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాతే ప్రమాణస్వీకారం చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముందు వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు. హిందూ సంప్రదాయాలను కాపాడుతూ.. భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యతన ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా పాలకమండలి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సమీక్షలు చేపడతామన్నారు. బంగారం వివాదాన్ని నిగ్గుతేల్చుతామని స్పష్టం చేశారు. ప్రధాన అర్చకుల తొలగింపు నిర్ణయాన్ని పునః సమీక్షిస్తామని వెల్లడించారు. టీటీడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu