మరిదితో అఫైర్: కక్షతో అతన్ని, ఆడపడుచుని చంపేసిన మహిళ అరెస్టు

Published : Jun 22, 2019, 11:04 AM IST
మరిదితో అఫైర్: కక్షతో అతన్ని, ఆడపడుచుని చంపేసిన మహిళ అరెస్టు

సారాంశం

మరిది, ఆడపడుచులపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. దాంతో వారు మృత్యువాత పడ్డారు. వారి తల్లి హమీదున్సీసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

విజయవాడ: మరిది, ఆడపడుచులపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. దాంతో వారు మృత్యువాత పడ్డారు. వారి తల్లి హమీదున్సీసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఆ ఘాతుకానికి ఒడిగట్టింది.

కానూరు సనత్‌నగర్‌ సిద్దిఖ్‌నగర్‌లో రిక్షాపుల్లర్‌ ఫరీద్, ఆమె భార్య ముంతాజ్‌బేగం నివసిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు(12) ఉన్నాడు. ముంతాజ్‌బేగానికి ఇంటి పక్కనే ఉంటున్న మరిది ఖలీల్‌(27)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన పెద్దలు వారిని మందలించారు. 

అయితే మూడు నెలల క్రితం ఖలీల్‌ నజీరున్నీసాను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన తరువాత నుంచి ఖలీల్‌ వదిన ముంతాజ్‌బేగానికి దూరంగా ఉంటున్నాడు. దాంతో ఆమె కక్ష పెంచుకుని హత్యకు కుట్ర చేసింది. ఈ నెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు ఇంట్లో ఉన్న ఖలీల్, నజీరున్నీసాను హతమార్చటానికి డబ్బాలో పెట్రోల్‌ తీసుకుని, మరో చేతితో కాగడా వెలిగించుకుని ఖలీల్‌ ఇంట్లోకి వెళ్లింది. 

బెడ్‌రూంలో భార్యాభర్తలు ఉంటారని గ్రహించి గదిలోకి వచ్చి ఖలీల్‌పై పెట్రోల్‌ పోసి నిప్పుంటించి గదికి గడియపెట్టి పారిపోయింది. అయితే ఆ సమయంలో గదిలో ఖలీల్‌తో పాటు దివ్యాంగురాలైన ఆడపడుచు హాజిని(49)మంచంపై ఉంది. ఈ ఘటనలో ఆడపడుచు సజీవ దహనం కాగా, కాలిన గాయాలతో ఖలీల్‌ కేకలు వేయటంతో అతడి భార్య నజీరున్నీసా, తల్లి హమీదున్నీసాలు వచ్చి తలుపు గడి తీశారు. విజయవాడ ప్రభుత్వస్పత్రిలో చికిత్స పొందుతూ ఖలీల్ అదే రోజు మృతి చెందాడు. శుక్రవారంనాడు పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి... ఈ తెలుగు జిల్లాల్లో రిపబ్లిక్ డే కూడా వర్షాలే
Deputy CM Pawankalyan: నాందేడ్ గురుద్వారా లో హిందీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu