క్రీడలపై వైసీపీ క్రీనీడలు.. ఆడుదాం ఆంధ్ర అంటూ 2 నెలలు సినిమా స్టంట్స్ - వైఎస్ షర్మిల

By Sairam Indur  |  First Published Feb 27, 2024, 1:34 PM IST

వైసీపీ నాయకులు అన్నింటిలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా అన్నారు. హనుమ విహారి రాజీనామా అంశంపై వెంటనే నిస్పాక్షికమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


ఆంధ్ర క్రికెట్ టీమ్ కు హనుమ విహారి రాజీనామ చేయడంతో ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. చివరికి ఇది రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై పొలిటికల్ లీడర్లు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఈ వివాదంపై స్పందించారు. వైసీపీ నాయకులు అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివాదాస్పద నేత, ఎంపీ షఫీకుర్ రెహ్మాన్ బార్క్ కన్నుమూత..

Latest Videos

ఏపీలో వైసీపీ నాయకులు క్రీడలపై కూడా ఇప్పుడు వారి దౌర్భాగ్య రాజకీయాలను, అధికారమదాన్ని చూపుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేమని తెలిపారు. వైసీపీ నాయకులు ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేయించారని ఆమె ఆరోపించారు.

సింహాలకు అక్బర్, సీత పేర్లు.. ఫారెస్ట్ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు.. అసలేం జరిగిందంటే ?

అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా? అని అన్నారు. ఇది ఆంధ్ర క్రికెట్ అస్సోసియేషనా లేకా అధ్వానపు క్రికెట్ అస్సోసియేషనా ? అని ప్రశ్నించారు. హనుమ విహారి రాజీనామ విషయంపై వెనువెటనే నిస్పాక్షికమైన విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. క్రీడలపై వైసీపీ క్రీనీడలు చేస్తోందని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

click me!