
కృష్ణా జిల్లా (krishna district) వైసీపీలో (ysrcp) నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జోగి రమేష్‌పై (jogi ramesh) సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ నాయకురాలు జక్కా లీలావతి (jakka leelavathi). పశ్చిమగోదావరి (west godavari district) జిల్లా భీమవరంలో (bhimavaram) శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ప్రెస్‌మీట్ పెడితే దానికి సమాధానం చెప్పే ధైర్యం లేక తన భర్త ను బెదిరించి బలవంతంగా ప్రెస్‌మీట్ పెట్టించి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది మీకు పద్ధతి కాదని.. మీక్కూడా భార్యా పిల్లలు ఉన్నారని లీలావతి అన్నారు.
తన భర్తను దూరం చేయాలని చూస్తే పద్ధతిగా ఉండదని ఆమె హెచ్చరించారు. తాను ప్రెస్‌మీట్ పెట్టిన రోజే జోగి రమేశ్ అనుచరులు.. మా ఇంటికి వచ్చి తన భర్తను తీసుకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని లీలావతి తెలిపారు. తనకు, తన భర్తకు, తమ పిల్లలకు జోగి రమేష్ వల్ల ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించారు. తాను ఏనాడు పదవులు ఆశించలేదని.. జోగి రమేష్ తన భర్తపై అక్రమ కేసులు పెడుతున్నాడని లీలావతి మండిపడ్డారు. గత రెండేళ్లుగా తాము హౌస్ అరెస్ట్‌లో ఉన్నామని లీలావతి అన్నారు. ఫోన్లు చేసి తమను చంపుతానని బెదిరిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగనే తమను కాపాడాలి అని లీలావతి కోరారు. దీనిపై అపాయింట్‌మెంట్ ఇస్తే తన బాధను తెలుపుకుంటానని.. ఒక అన్నగా రక్షణ కల్పించాలని ఆమె కోరారు.