వీడిన ఉత్కంఠ: మైదుకూరు మున్సిపల్ చైర్మెన్ పీఠం వైసీపీదే

By narsimha lodeFirst Published Mar 18, 2021, 1:01 PM IST
Highlights

కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపల్ ఛైర్మెన్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకొంది. ఈ  మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకొన్నప్పటికీ మున్సిపల్ చైర్మెన్ స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోలేకపోయింది.

మైదుకూరు:కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపల్ ఛైర్మెన్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకొంది. ఈ  మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకొన్నప్పటికీ మున్సిపల్ చైర్మెన్ స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోలేకపోయింది.

మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీ 12 స్థానాలను దక్కించుకొంది. అయితే టీడీపీ నుండి విజయం సాధించిన షేక్ మహబూబీ మాత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో టీడీపీ బలం 12 నుండి 11కి తగ్గిపోయింది. 

టీడీపీకి చెందిన కౌన్సిలర్ ఈ సమావేశానికి ఎందుకు హజరుకాలేదనే విషయమై టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. వైసీపీ నేతలే తమ పార్టీ కౌన్సిలర్ ను సమావేశానికి రాకుండా అడ్డుకొన్నారని ఆరోపిస్తున్నారు.చివరకు రెండు ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో వైసీపీ బలం 11 నుండి 13కి పెరిగింది. దీంతో వైసీపీ  మున్సిపల్ చైర్మెన్ పీఠాన్ని దక్కించుకొంది.

మైదుకూరు మున్సిపల్ ఛైర్మెన్ గా మామనూరు చంద్ర, వైస్ ఛైర్మెన్ గా  మహబూబ్ షరీఫ్ ఎన్నికయ్యారు.

click me!