టీడీపీ ఆశలు గల్లంతు.. బెజవాడలో వైసీపీ పాగా, 18 మేయర్ ఎన్నిక

Siva Kodati |  
Published : Mar 14, 2021, 08:14 PM IST
టీడీపీ ఆశలు గల్లంతు.. బెజవాడలో వైసీపీ పాగా, 18 మేయర్ ఎన్నిక

సారాంశం

చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన విజయవాడ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపులో వైసీపీ ఆధిక్యాన్ని సాధించింది. తద్వారా కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికే 33 సీట్లతో అధికారపార్టీ పూర్తి ఆధిక్యంతో కొనసాగుతోంది.

మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే 33 సీట్ల మేజిక్ ఫిగర్ కావాలి. మేజిక్ ఫిగర్‌ను ఇప్పటికే అధికార పార్టీ అధిగమించింది. 33 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో విజయవాడ మేయర్ పీఠం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లిపోయింది.

12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే 11వ డివిజన్‌ నుంచి టీడీపీ మేయర్‌ అభ్యర్ధి కేశినేని శ్వేత విజయం సాధించారు.

కాగా, విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్ మేయర్‌, డిప్యూటీ మేయర్ ఎంపిక ఈనెల 18వ తేదీన జరుగుతుంది. గెలుపొందిన కార్పొరేటర్లకు నోటీసులు ఇచ్చి ఎంపిక కార్యక్రమంలో పాల్గొనాలని కోరతారు.

ఇందుకోసం ఎన్నికల సంఘం ప్రిసైడింగ్‌ అధికారులను నియమించింది.  విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎంపిక ప్రక్రియకు కలెక్టర్‌ ఇంతియాజ్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా నిర్వహిస్తారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం