రఘురామపై మరోసారి అనర్హత పిటిషన్: స్పీకర్ కి వైసీపీ ఫిర్యాదు

By narsimha lode  |  First Published Jul 8, 2021, 4:06 PM IST

 రెబెల్ ఎంపీ, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై  లోక్‌సభ స్పీకర్ కు  వైసీపీ ఫిర్యాదు చేసింది. రాజుపై అనర్హత వేటేయాలని  వైసీపీ కోరింది. గతంలో కూడ ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 



 న్యూఢిల్లీ:  నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ నేతలు మరోసారి అనర్హత పిటిషన్ ఇచ్చారు.  గతంలో కూడ రఘురామకృష్ణంరాజుపై  అనర్హత వేటేయాలని వైసీపీ పిటిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.గురువారం నాడు వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ విషయమై మరోసారి అనర్హత పిటిషన్ ఇచ్చారు.  ఈ ఏడాది జూన్ 12వ తేదీన వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్  లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వినతి పత్రం సమర్పించారు.

పార్టీకి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలతో పాటు మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్ లను కూడ భరత్ స్పీకర్ కు అందించారు.  పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణంరాజుపై రాజ్యాంగంలోని  10వ షెడ్యూల్ ప్రకారంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్ ఇచ్చి దాదాపుగా నెల రోజుల సమయం కావొస్తోంది. త్వరలోనే  లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో  మరోసారి వైసీపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత పిటిషన్  ఇచ్చింది.

Latest Videos

click me!