సీఐడీ అధికారుల మొబైల్ డేటాపై బాబు పిటిషన్: సీఐడీ కౌంటర్ దాఖలు, విచారణ రేపటికి వాయిదా

టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన  సీఐడీ అధికారుల మొబైల్ కాల్ డేటా రికార్డు పిటిషన్ పై విచారణను  రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.

ACB Court Adjourns hearing Chandrababunaidu seeking of AP CID mobile data lns

అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  దాఖలు చేసిన సీఐడీ అధికారుల  మొబైల్ కాల్ డేటా  రికార్డు పిటిషన్ పై విచారణను ఈ నెల  27వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును  ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల  మొబైల్ కాల్ డేటా ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు  ఈ ఏడాది సెప్టెంబర్  11న  ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సవరించి వేయాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సూచించారు.  

Latest Videos

దీంతో  ఈ పిటిషన్ ను సవరించి  దాఖలు చేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు . ఈ నెల  18వ తేదీన ఈ పిటిషన్ పై విచారణను  వాయిదా వేసింది కోర్టు.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల  20వ తేదీకి  ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.

ఈ కేసులో  కౌంటర్ దాఖలు చేయాలని  సీఐడీ తరపు న్యాయవాదిని ఏసీబీ కోర్టు ఈ నెల  20న ఆదేశించింది. అయితే  తమకు సమయం కావాలని సీఐడీ తరపు న్యాయవాది ఏసీబీ కోర్టును కోరారు. దీంతో  ఈ నెల 26వ తేదీ వరకు ఈ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.  కోర్టు ఆదేశాల మేరకు  ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు  ఈ కేసులో కౌంటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టుగా  ఏసీబీ కోర్టు గురువారంనాడు తెలిపింది.

also read:సీఐడీ అధికారుల మొబైల్ డేటాపై బాబు పిటిషన్: సీఐడీ కౌంటర్ దాఖలు, విచారణ రేపటికి వాయిదా

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో  స్పెషల్ లీవ్ పిటిషన్ ను  దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై చంద్రబాబు తరపు న్యాయవాదులు  హరీష్ సాల్వే, సిధ్దార్థ్ లూథ్రా , ఏపీ సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు విన్పించారు.  ఇరువురి వాదనలు  సుప్రీంకోర్టు విన్నది.   ఈ ఏడాది నవంబర్  8న  ఈ పిటిషన్ పై  సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. 17 ఏ సెక్షన్ చుట్టే వాదనలు జరిగాయి. చంద్రబాబుకు  17 ఏ సెక్షన్ వర్తిస్తుందని  హరీష్ సాల్వే,  సిద్దార్థ్ లూథ్రా వాదించారు. ఈ సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని  ముకుల్ రోహత్గీ వాదించారు.

vuukle one pixel image
click me!