లక్కీరెడ్డిపల్లెలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు, వాహనాలు ధ్వంసం

By Sumanth KanukulaFirst Published May 14, 2022, 5:12 PM IST
Highlights

అన్నమయ్య జిల్లా వైసీపీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. జిల్లాలోని లక్కీరెడ్డి పల్లెలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ కంచం రెడ్డి వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. 

అన్నమయ్య జిల్లా వైసీపీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. జిల్లాలోని లక్కీరెడ్డి పల్లెలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ కంచం రెడ్డి వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. స్థలం విషయంలో ఇరువర్గాల పరస్పరం రాళ్లతో దాడులు చేసుకన్నారు. ఈ ఘర్షణలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో.. మూడు జీపులు, జేసీబీలులు ధ్వంసం అయ్యాయి.  దీంతో లక్కీరెడ్డి పల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ క్రమంలోనే పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో అక్కడి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కంచం రెడ్డి వర్గీయులు మాట్లాడుతూ.. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుని తమ ల్యాండ్‌లో పని చేస్తుండగా రాళ్ల దాడి జరిగిందన్నారు. ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ప్రోద్భలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. పలువురికి గాయాలు అయ్యాయని, వాహనాలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందన్నారు.

click me!