వైసీపీ మేయర్, వైస్ ఛైర్మన్ల జాబితా ప్రకటన వాయిదా, కారణమిదే

By Siva KodatiFirst Published Mar 17, 2021, 9:02 PM IST
Highlights

ఇవాళ మేయర్, వైస్ ఛైర్మన్ల జాబితా ప్రకటించాలని భావించామని.. అయితే కొన్ని కారణాల వల్ల దానిని రేపటికి వాయిదా వేసినట్లు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఇవాళ మేయర్, వైస్ ఛైర్మన్ల జాబితా ప్రకటించాలని భావించామని.. అయితే కొన్ని కారణాల వల్ల దానిని రేపటికి వాయిదా వేసినట్లు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన నామినేటెడ్ పదవుల్లో మహిళలు సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు. చట్టబద్ధంగా వున్న రిజర్వేషన్లకు మించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను కల్పించాలని సీఎం నిర్ణయించారని సజ్జల వెల్లడించారు.

బీసీలు, మైనార్టీలకు పెద్దపీట వేస్తూ అవకాశం కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొన్ని స్థానాలకు అభ్యర్ధులు ఖరారయ్యారని.. ఇంకా కొన్ని ఖాళీలు పూర్తి కావాల్సి వుందని సజ్జల వెల్లడించారు.

70 శాతం స్థానాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని.. దీని వల్లే ఇవాళ అభ్యర్ధుల జాబితా ప్రకటించడం లేదని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రేపు స్థానిక సంస్థల్లో ఖరారు చేసిన రిజర్వేషన్లు తెలియజేస్తామని.. ఎస్సీ, ఎస్టీ భూములను ప్రలోభాలకు గురిచేసినా ఆక్రమించడం చేసినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తిస్తుందని సజ్జల తెలిపారు.

చంద్రబాబులో భయం చాలా స్పష్టంగా కనిపిస్తోందంటూ రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఇంకా మేనేజ్ చేయగలమని అనుకుంటున్నారని.. కానీ చట్టం పని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు. కక్ష సాధింపు చేసే ఆలోచన జగన్‌కు లేదని.. చట్టబద్ధంగానే చంద్రబాబుపై దర్యాప్తు జరుగుతుందని రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు. 

click me!