పులివెందులలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు.. నా కుటుంబాన్ని నాశనం చేయడమే లక్ష్యం: అవినాష్ రెడ్డి

Published : Aug 03, 2023, 01:24 PM ISTUpdated : Aug 03, 2023, 01:36 PM IST
పులివెందులలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు.. నా కుటుంబాన్ని నాశనం చేయడమే లక్ష్యం: అవినాష్ రెడ్డి

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పులివెందులలో చంద్రబాబు పర్యటనలో అన్ని అబద్దాలే చెప్పారని విమర్శించారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ  ఎంపీ అవినాష్ రెడ్డి  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పులివెందులలో చంద్రబాబు పర్యటనలో అన్ని  అబద్దాలే  చెప్పారని  విమర్శించారు. రాయలసీమలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు.. వాటి సందర్శనకు రావడానికి ఆయనకు ఉన్న  ధైర్యం ఏమిటో అర్థం కావడం లేదని  అన్నారు. ధర్మం, నిజాయితీ గురించి  చంద్రబాబే మాట్లాడాలని ఎద్దేవా  చేశారు. కోదమ సింహం అని మనం  చెప్పడం కాదని.. ప్రజలు చెప్పాలని అన్నారు. పదే  పదే సింహం అని అనుకుంటే ప్రజలు భయస్థుడని అని అనుకుంటున్నారని సెటైర్లు వేశారు. 

పోతిరెడ్డిపాడుకు 11 వేల క్యూసెక్కులకు వెడల్పు చేసింది వైఎస్సార్ మాత్రమేనని అన్నారు. ఆరు జిల్లాలకు నీరిచ్చేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని చెప్పారు.   బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు, వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద మనిషి సాయంతో తనను, తన కుటుంబాన్ని నాశనం  చేయాలని, తన ద్వారా సీఎం జగన్‌ను ఇబ్బంది పెట్టాలనేదే చంద్రబాబు లక్ష్యం అని ఆరోపించారు. పులివెందులను వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా  అభివృద్ది చేస్తుందని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. పులివెందులలో సీఎం వైఎస్ జగన్‌పై తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల స్థానాన్ని వైఎస్ జగన్ నుంచి టీడీపీ  కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తున్న చంద్రబాబు నాయుడు తన పర్యటనలో భాగంగా బుధవారం గండికోట రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల చంద్రబాబు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి. 

ఇక, పులివెందుల పూలఅంగళ్ల సెంటర్‌లో ఏర్పాటు  చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులను ఉద్దేశించి.. ‘‘వై నాట్ పులివెందుల’’ అని నినాదం చేశారు. పులివెందులలో తిరుగుబాటు ప్రారంభమైందని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన సాగునీటి ప్రాజెక్టులపై జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల, గండికోట, పైడిపాలెం, చిత్రావతికి నీళ్లు తెచ్చింది టీడీపీనేనని.. బానకచెర్లకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి రాయలసీమకు సరిపడా నీళ్లు అందించడమే తన జీవిత ఆశయమని అన్నారు.


పులివెందులలో బస్టాండ్ సమస్యను తాను లేవనెత్తిన తర్వాతే వైసీపీ ప్రభుత్వం నిర్మించిందని చంద్రబాబు అన్నారు. పులివెందులలో జగన్ 8 వేల ఇళ్లు కట్టించారా అని ప్రశ్నించారు. అలాగే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం టీడీపీ రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని.. వైసీపీ కేవలం రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు. ‘జై అమరావతి’ అంటూ అక్కడి జనాల చేత నినాదాలు చేయించారు. అమరావతి రాజధానికి పులివెందుల ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో జగన్ చూడాలి అంటూ వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వం కరెంట్ చార్జీలను విపరీతంగా  పెంచిందని విమర్శలు గుప్పించారు. టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత  విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్‌పై టీడీపీ అభ్యర్థిగి బీటెక్ రవి పోటీ చేయనున్నట్టుగా ప్రకటించారు. పులివెందుల ప్రజలు బీటెక్ రవికి మద్దతు అందించాలని  కోరారు. ‘‘జగన్ రెడ్డి.. నీ బాబాయ్ ని చంపింది ఎవరో, పులివెందుల చెప్తుంది విను’’ అని  కామెంట్స్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Flags Off Vehicles to Lok Bhavan | Crore Signatures Paper Transfer | Asianet News Telugu
BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu