శవాల మీద పేలాలు ఏరుకుంటున్నామా..? ఇంతకీ శవం నువ్వా? మీ నాన్నా?: లోకేష్ కి విజయసాయిరెడ్డి కౌంటర్

By Nagaraju penumalaFirst Published 20, Feb 2019, 5:17 PM IST
Highlights

మరోవైపు ప్రపంచమంతా పుల్వామా ఉగ్రవాద దాడిని ఖండిస్తుంటే చంద్రబాబుకు మాత్రం అది మరోలా కనిపిస్తోందని సెటైర్ వేశారు.1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లపై వెల్లువెత్తిన సానుభూతిలో బిజెపితో జతకట్టి లాభపడిందెవరు చంద్రబాబూ అని ప్రశ్నించారు. అలిపిరిలో మీపై జరిగిన దాడి కూడా సొంతంగా చేయించుకున్నదేనా అంటూ నిలదీస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ట్విట్టర్ కామెంట్లపై ఘాటుగా స్పందించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి. లోకేష్... మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాం అని ట్వీట్ పెట్టావ్. ఇంతకీ శవం ఎవరు. నువ్వా? మీ నాన్నా? అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

లోకేష్...
మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాం అని ట్వీట్ పెట్టావ్. ఇంతకీ శవం ఎవరు.
నువ్వా? మీ నాన్నా?

— Vijayasai Reddy V (@VSReddy_MP)

మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడుపైనా విమర్శలు చేశారు. త్రివేండ్రం అంర్జాతీయ ఎయిర్ పోర్టును ప్రేవేటు రంగంలో అభివృద్ధి చేయాలని కేంద్రం టెండర్లు పిలిస్తే కేరళ ప్రభుత్వం కేఎస్ఐడీసీ ద్వారా పోటీ పడుతోందని తెలిపారు. ఇటువంటి ధైర్యం చేయగలరా చంద్రబాబూ అంటూ  నిలదీశారు.

 ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టేది మీ ధనార్జనకే కదా అంటూ ప్రశ్నించారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చంద్రబాబు దోచుకునేందుకేనని ఆరోపించారు. 

మరోవైపు ప్రపంచమంతా పుల్వామా ఉగ్రవాద దాడిని ఖండిస్తుంటే చంద్రబాబుకు మాత్రం అది మరోలా కనిపిస్తోందని సెటైర్ వేశారు.1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లపై వెల్లువెత్తిన సానుభూతిలో బిజెపితో జతకట్టి లాభపడిందెవరు చంద్రబాబూ అని ప్రశ్నించారు. అలిపిరిలో మీపై జరిగిన దాడి కూడా సొంతంగా చేయించుకున్నదేనా అంటూ నిలదీస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి

ప్రపంచమంతా కశ్మీర్ ఉగ్రవాద దాడిని ఖండిస్తుంటే చంద్రబాబుకు మాత్రం అది మరోలా కనిపిస్తోంది.1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లపై వెల్లువెత్తిన సానుభూతిలోబిజెపితో జతకట్టి లాభపడిందెవరు చంద్రబాబూ? అలిపిరిలో మీపై జరిగిన దాడి కూడా సొంతంగా చేయించుకున్నదేనా?

— Vijayasai Reddy V (@VSReddy_MP)

Last Updated 20, Feb 2019, 5:18 PM IST