స్వరూపానంద ఆధ్వర్యంలో దీక్ష: అతిథులుగా గవర్నర్, కేసీఆర్, జగన్

By Siva KodatiFirst Published Jun 14, 2019, 6:43 PM IST
Highlights

విజయవాడ కనకదుర్గమ్మను విశాఖ శారదా పీఠాధిపతి, జగద్గురు శంకరాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ వేద పండితులు మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభంతో స్వామిజీకి స్వాగతం పలికారు

విజయవాడ కనకదుర్గమ్మను విశాఖ శారదా పీఠాధిపతి, జగద్గురు శంకరాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ వేద పండితులు మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభంతో స్వామిజీకి స్వాగతం పలికారు.

అనంతరం స్వరూపానందేంద్ర మీడియాతో మాట్లాడుతూ..   దేవాలయ భూములు, వ్యవస్థలు, టీటీడీలో ఆగడాలపై పోరాటం చేసిన ఏకైక పీఠం విశాఖ పీఠం మాత్రమేనన్నారు. లోకకల్యాణార్ధం సన్యాసికారి కార్యక్రమాన్ని చేస్తున్నామని.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు పడాలని సన్యాసిదీక్ష చేపడుతున్నామన్నారు.

15 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌తో పాటు పలువురు ప్రముఖులు  హాజరవుతున్నారని తెలిపారు. ఈ ఉత్తరాధికార బాధ్యతలను కిరణ్ కుమార్‌ కు అప్పగించామని స్వరూపానంద వెల్లడించారు.

click me!