టీడీపీలో రామారావులు లేరు.. అంతా కామారావులే, నా... రా... అంటే ఏమిటంటే : మహానాడుపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 27, 2022, 08:16 PM IST
టీడీపీలో రామారావులు లేరు.. అంతా కామారావులే, నా... రా... అంటే ఏమిటంటే : మహానాడుపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

సారాంశం

తెలుగుదేశం పార్టీలో రామారావులు లేరని.. ఇప్పుడు వున్నదంతా కామారావులేనని వ్యాఖ్యానించారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. చంద్రబాబు నిర్వహిస్తున్నది మహానాడు కాదని, మహా స్మశానమని ఆయన వ్యాఖ్యానించారు.   

ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడు (tdp mahanadu) , ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) వైసీపీ (ysrcp) జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి (vijayasai reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంచనకు, వెన్నుపోటుకు పుట్టిన ఉన్మాది చంద్రబాబునాయుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ఉన్మాదంతోనే పిల్లనిచ్చిన మామను చంపాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. నాడు 73 ఏళ్ల ఎన్టీఆర్‌కు (ntr) వెన్నుపోటు పొడిచాడని.. ఇప్పుడు 72 ఏళ్ల వయసున్న చంద్రబాబుకు ఆయన కొడుకు కూడా వెన్నుపోటు పొడుస్తాడని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. 

నా... రా... అంటే నాసిరకం రాజకీయ నాయకుడని.. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై కక్షగట్టాడని ఆరోపించారు. చంద్రబాబును ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. "కిక్ బాబు... సేవ్ ఏపీ" అన్నదే మన నినాదం అని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నిర్వహిస్తున్నది మహానాడు కాదని, మహా స్మశానం అని విజయసాయి అభివర్ణించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమై ఇప్పుడు శ్రాద్ధం పెట్టినట్టు మహానాడు జరుపుతున్నాడని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉన్నతాశయంతో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో రామారావు లేరని తెలిపారు. ఇప్పుడున్న వారంతా 'కామారావు'లేనని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 

Also REad:జగన్ గట్టిగా చూస్తే చస్తారు.. వార్డు మెంబర్లుగా కూడా గెలవలేరు, తొడలు కొడతారా : మహానాడుపై కొడాలి నాని వ్యాఖ్యలు

అంతకుముందు మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. అమలాపురంలో మా ఎమ్మెల్యే, మంత్రి ఇళ్లకు నిప్పంటించి మళ్లీ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. టీడీపీకి ఏపీ ప్రజలు  ఎప్పుడో సమాధి కట్టారని నాని అన్నారు. బస్సు యాత్రపై (ysrcp ministers bus yatra) చంద్రబాబు విషం కక్కుతున్నాడని.. మహానాడుకు భయపడుతున్నారు అనటానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలంటూ నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని వ్యక్తి జగన్‌ను ఓడిస్తాడా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కొడాలి నాని హెచ్చరించారు.

చంద్రబాబు ఎందుకు బతికి ఉన్నాడో అతనికే తెలియదని... ఎన్టీఆర్ చెప్పినట్లు చంద్రబాబు జామాత దశమ గ్రహమని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ను చంపి, పూల మాలలు వేస్తున్నారని నాని మండిపడ్డారు. జగన్ గట్టిగా చూస్తే చచ్చే వెధవలు తొడలు కొడుతున్నారంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వారు ఆ వేదిక మీద ఉన్నారని... పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడు (atchannaidu) పార్టీ అధ్యక్షుడా అంటూ నాని మండిపడ్డారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే