జగన్ అక్రమాస్తుల కేసు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: ఎంపీ విజయసాయిరెడ్డి

By Siva KodatiFirst Published Sep 1, 2021, 9:26 PM IST
Highlights

సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారణ జరపొచ్చు అని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయనున్నట్టు జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ, ఈడీ కోర్టులో మెమో దాఖలు చేశారు.  

సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారణ జరపొచ్చు అని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయనున్నట్టు జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ, ఈడీ కోర్టులో మెమో దాఖలు చేశారు.  హైకోర్టు తీర్పు కాపీ కోసం ఎదురు చూస్తున్నామని, న్యాయ సలహాలు తీసుకొని సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన అందులో పేర్కొన్నారు. అందు వల్ల ఇవాళ జరగాల్సిన ఈడీ కేసుల విచారణ వాయిదా వేయాలని విజయసాయిరెడ్డి కోరారు. అయితే ఆయన అభ్యర్థనపై తమకు అభ్యంతరం లేదని ఈడీ తెలిపింది. దీంతో ఈడీ కేసుల విచారణను న్యాయస్థానం ఈ నెల 9కి వాయిదా వేసింది.  

కాగా, పెన్నా సిమెంట్స్‌ ఛార్జ్‌షీట్‌ నుంచి తొలగించాలని కోరుతూ సీఎం జగన్‌ దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. పెన్నా కేసులో పీఆర్‌ ఎనర్జీ డిశ్ఛార్జి పిటిషన్‌పై  వాదనలు ముగిశాయి. ఈ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత అధికారులు శామ్యూల్‌, రాజగోపాల్‌, పయనీర్‌ హాలిడే రిసార్ట్స్‌ డిశ్ఛార్జ్‌ పిటిషన్లతో పాటు పెన్నా ఛార్జిషీట్‌పై విచారణ ఈనెల 6కి వాయిదా పడింది. అలాగే ఎమ్మార్‌ విల్లాల విక్రయంపై సీబీఐ, ఈడీ కేసుల విచారణను న్యాయస్థానం ఈనెల 15కి వాయిదా వేసింది.  

click me!