పూడిమడక తీరంలో విషాదం.. మరో రెండు మృతదేహాలు లభ్యం.. ఇంకా లభించని ముగ్గురు విద్యార్థుల ఆచూకీ

Published : Jul 30, 2022, 11:10 AM IST
పూడిమడక తీరంలో విషాదం.. మరో రెండు మృతదేహాలు లభ్యం.. ఇంకా లభించని ముగ్గురు విద్యార్థుల  ఆచూకీ

సారాంశం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక తీరంలో విషాదం చోటు చేసుకుంది. గల్లైంతనవారిలో మరో రెండు మృతదేహాలను గుర్తించారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. మరో ముగ్గురు విద్యార్థుల ఆచూకీ గుర్తించాల్సి ఉంది. 

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక తీరంలో విషాదం చోటు చేసుకుంది. గల్లైంతనవారిలో మరో రెండు మృతదేహాలను గుర్తించారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. మరో ముగ్గురు విద్యార్థుల ఆచూకీ గుర్తించాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వివరాలు.. అనకాపల్లి డైట్ కాలేజ్‌కు చెందిన 12 మంది విద్యార్థులు శుక్రవారం పూడిమడక తీరానికి వచ్చారు. వీరిలో 11 మంది సముద్రం నీటిలో సరదగా గడిపేందుకు దిగారు. అయితే బలమైన ప్రవాహానికి ఏడుగురు కొట్టుకుపోయారు. 

అయితే సముద్రంలోకి వెళ్లని విద్యార్థి వెంటనే స్థానిక మత్స్యకారులను అప్రమత్తం చేశారు. దీంతో స్థానిక మత్స్యకారులు మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజ అనే వ్యక్తిని రక్షించారు. మరో విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడిని నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లికి చెందిన గుడివాడ పవన్ సూర్య కుమార్‌గా గుర్తించారు. తేజను చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. 

మిగిలిన ఐదుగురి కోసం మెరైన్ పోలీసులతో పాటు పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. చీకటి పడేవరకు సహాయక చర్యలు చేపట్టారు. బీచ్ రిస్క్ జోన్ అని.. అదనంగా గురువారం అమవాస్య కావడంతో శుక్రవారం సముద్రం అల్లకల్లోలంగా ఉందని అధికారులు తెలిపారు. చీకటి పడటంతో నిన్న సహాయక చర్యలను నిలిపివేశారు. శనివారం తెల్లవారుజామున తిరిగి సహాయక చర్యలను ప్రారంభించారు. 

విద్యార్థుల ఆచూకీ కోసం రెండు నేవీ హెలికాప్టర్, నాలుగు బోట్లతో కోస్టు గార్డులు, మెరైన్ పోలీసులు సముద్ర  తీరంలో గాలిస్తున్నారు. స్థానిక మత్స్యకారులు కూడా వీరికి సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. నీటిపై తేలియాడుతున్న మృతదేహాలను ఓడ్డుకు చేర్చారు. ఆ మృతదేహాలను గణేష్, జగదీష్‌లవిగా గుర్తించారు. మరో ముగ్గురు విద్యార్థులు జశ్వంత్, రామచంద్, సతీష్‌ల ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. 


పూడిమడక బీచ్‌లో విద్యార్థులు గల్లంతు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు పర్యవేక్షించాలని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు