ఆ విషయంలో తండ్రిని మించావు.. బావిలో కప్పలా బతకకు ‘చిట్టినాయుడూ’ : లోకేశ్‌పై విజయసాయిరెడ్డి సెటైర్లు

Siva Kodati |  
Published : Mar 22, 2022, 04:01 PM ISTUpdated : Mar 22, 2022, 04:06 PM IST
ఆ విషయంలో తండ్రిని మించావు.. బావిలో కప్పలా బతకకు ‘చిట్టినాయుడూ’ : లోకేశ్‌పై విజయసాయిరెడ్డి సెటైర్లు

సారాంశం

పెగాసస్ వ్యవహారం ఏపీలో అధికార , ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేత నారా లోకేశ్‌కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు  విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. 

పెగాసస్ వ్యవహారంపై  (pegasus) టీడీపీ నేత (tdp) , ఎమ్మెల్సీ నారా లోకేశ్ (nara lokesh) చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ (ysrcp) విజయసాయిరెడ్డి (vijayasai reddy) కౌంటరిచ్చారు. అబద్ధాలను వల్లె వేయడంలో చిట్టి నాయుడు.. తన తండ్రిని మించిపోయాడంటూ ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్ (west bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamata banerjee) పెగాసస్ పై అసలు మాట్లాడనేలేదా? అంటూ ప్రశ్నించారు. 

‘‘ చిట్టి నాయుడూ! అబద్ధాలు వల్లెవేయడంలో తండ్రిని మించిపోయావు. మమత అసలు పెగాసెస్‌పై మాట్లాడనే లేదా? పెగాసెస్‌పై బెంగాల్‌ అసెంబ్లీలో మమత చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో పతాక శీర్షికల్లో వచ్చింది. అప్పుడప్పుడు ఇంగ్లీష్‌ పేపర్లు కూడా చూడు. ఎల్లో మీడియాను నమ్ముకుని బావిలో కప్పలా బతకొద్దు.’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

కాగా... ఆంధ్రప్రదేశ్‌లో పెగాసస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ పెగాసస్ ‌విషయంలో వైసీపీ ప్రభుత్వానికి సవాలు విసిరారు. పెగాసస్‌పై ఏ విచారణకైనా తాము సిద్దంగా ఉన్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు. బాబాయ్ హత్య విషయంలోనూ, మద్యం మరణాలపైనా విచారణ చేయగలరా అని వైసీపీ ప్రభుత్వాన్ని లోకేష్ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో పెగాసర్ గురించి మాట్లాడారా..? లేదా..? అనే స్పష్టత లేదని లోకేష్ పేర్కొన్నారు. బెంగాలీలో మాట్లాడిన వీడియోలో పెగాసెస్ ప్రస్తావన కూడా లేదని బెంగాలీ తెలిసిన తన స్నేహితుడు చెప్పాడంటూ పేర్కొన్నారు.

ఇక, Pegasusపై హౌస్ కమిటీతో విచారణ జరిపిస్తామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ Tammineni Sitaram సోమవారం శాసనసభలో ప్రకటించారు. ఈ విషయమై ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా ఇతర సభ్యులు కోరిన మీదట హౌస్ కమిటీ విచారణకు స్పీకర్ ఆదేశించారు. పెగాసెస్ అంశంపై ఏపీ అసెంబ్లీలో  సోమవారం నాడు చర్చ జరిగింది.  ఈ చర్చలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranathపాల్గొన్నారు. Chandrababu Naidu పెగాసెస్ సాఫ్ట్ వేర్  కొనుగోలు చేశారని బెంగాల్ సీఎం Mamata Benarjee అసెంబ్లీలోనే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.  కచ్చితమైన సమాచారం ఉండి ఉంటేనే మమత బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన గుర్తు చేశారు.

పెగాసెస్ వంటి స్పైవేర్ తో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందన్నారు. ఈ సాఫ్ట్ వేర్ తో వ్యక్తిగత వివరాలను కూడా తెలుసుకొనే అవకాశం కూడా ఉందన్నారు. ఇలాంటి అనైతిక కార్యక్రమాలు ఇల్లీగల్ గానే చేస్తారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఇది ప్రమాదమే కాదు అనైతికం కూడా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఇలాంటి ప్రమాదకర  సాఫ్ట్‌వేర్ ను చంద్రబాబు కొన్నారంటే ఎంత దుర్మార్గమన్నారు.పెగాసెస్‌తో ఏమేమీ చేశారో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu