బాబును చిట్టినాయుడు అంటూ సెటైర్లు వేసిన విజయసాయి

Arun Kumar P   | Asianet News
Published : Jan 21, 2020, 10:05 PM IST
బాబును చిట్టినాయుడు అంటూ సెటైర్లు వేసిన విజయసాయి

సారాంశం

టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని చిట్టినాయుడు అంటూ వైసిపి  ఎంపీ విజయసాయి రెడ్డి  సెటైర్లు విసిరారు. 

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. అసెంబ్లీలో పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్ సాక్షిగా సెటైర్లు వేశారు. 

అమరావతికి వరద ముప్పు లేదంట. రేగడి నేలలైనా భారీ నిర్మాణాలకు అనుకూలమే అని చెప్పడానికి ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోంది. చివరకు కోల్కతా, ముంబై నగరాలు ప్రమాదకరమైనవని తీర్పు చేప్పే సాహసానికి తెగబడింది. చంద్రబాబు నక్క అంటే నక్క, కుక్క అంటే కుక్క అనడమే పచ్చ మీడియా పని. అన్నారు.

read more  రూల్ 71: బుగ్గన ఆ ప్రతిపాదన ఎందుకు చేశారు

మరో ట్వీట్‌లో అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రమోషన్ కోసం ఏటా స్విట్జర్లాండ్ లోని దావోస్ సదస్సుకు వెళ్లేవాడు చంద్రబాబు. చిట్టినాయుడు కూడా ప్రత్యేక విమానాల్లో తిరిగొచ్చేవాడు. జపాన్, సింగపూర్, చైనా, కజాకిస్థాన్, మలేసియా, థాయిలాండ్ లకు లెక్కలేనన్ని సార్లు పర్యటనలు చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?