స్టీల్ ప్లాంట్‌ను వదులుకునేది లేదు.. జగన్ మాట ఇదే: విజయసాయిరెడ్డి

By Siva KodatiFirst Published Feb 20, 2021, 7:05 PM IST
Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శనివారం ఆయన నిరసన ర్యాలీ చేపట్టారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శనివారం ఆయన నిరసన ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. స్టీల్ ప్లాంట్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేమని సీఎం జగన్ స్పష్టం చేశారని విజయసాయి గుర్తుచేశారు. విశాఖకు రావొద్దని పోస్కో కంపెనీ ప్రతినిధులకు సీఎం జగన్ చెప్పారని ఆయన వెల్లడించారు.

ఎన్నో త్యాగాల ఫలమే విశాఖ స్టీల్ ప్లాంట్ అన్న ఆయన.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని విజయసాయి చెప్పారు.

కావాలంటే స్టీల్ ప్లాంట్‌ను కడపలోనో కృష్ణపట్నంలోనో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకోండని జగన్ పోస్కో కంపెనీకి చెప్పారని వైసీపీ ఎంపీ గుర్తుచేశారు. పోస్కో కంపెనీ స్టీల్ ప్లాంట్‌ను తీసుకోవడాన్ని ఏ మాత్రం అంగీకరించమన్నారు.

సొంతంగా గనులు లేకపోవడం, విస్తరణ ప్లాంట్ నష్టాలకు కారమణని విజయసాయి అభిప్రాయపడ్డారు. ప్లాంట్‌పై రూ.20 వేల కోట్ల అప్పు వుంటే, ఏడాదికి రూ.2,800 కోట్ల వడ్డీ కడుతున్నామని ఆయన వెల్లడించారు.

అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల నుంచి వచ్చిందని.. రుణభారాన్ని కేంద్రం ఈక్విటీ రూపంలోకి మారిస్తే ప్లాంట్ మళ్లీ లాభాల్లోకి వస్తుందని విజయసాయి పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారని ఆయన గుర్తుచేశారు. 

click me!