మరీ ఇంతలా కట్టడి చేస్తారా, చెప్పుకోలేకపోతున్నాం: జగన్ వద్ద ముగ్గురు మంత్రుల ఆవేదన

By Nagaraju penumalaFirst Published Nov 27, 2019, 7:19 PM IST
Highlights

ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ మంత్రులను డమ్మీలుగా చేసి అధికారాలను తన దగ్గరే ఉంచుకున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. మంత్రులు నామ్ కే వాస్తే అని తెలియడంతోనే అధికారులు కనీసం విలువ ఇవ్వడం లేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

అమరావతి: ఏపీ మంత్రులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ కట్టడి చేస్తున్నారా...? ప్రతీది చెప్పి చేయాలంటూ అనుక్షణం గమనిస్తూనే ఉన్నారా..? పేరుకు మంత్రి పదవులు ఇచ్చి వారి స్వేచ్ఛను జగన్ లాగేసుకుంటున్నారా...?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అనంతరం వైయస్ జగన్ కొందరు మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఓ కోస్తాకు చెందిన మంత్రిని ఎలా ఉన్నారు, మీ శాఖ ఎలా ఉంది అని ప్రశ్నించారు. జూనియర్ లైన్ మెన్ల నియామకంలో మంత్రులు లేదా ఇఛార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. 

అందుకు జగన్ అంగీకరించలేదు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారానే అన్ని రకాల నియామకాలు చేపట్టాలని తెగేసి చెప్పేశారు. నియామకాలన్నీ పారదర్శకంగా జరపాలంటూ ఆదేశించారు. నియామకాలలో పార్టీల గురించి ఆలోచన చేయోద్దని గట్టిగా చెప్పారు. 

పార్టీల గురించి ఆలోచన చేయోద్దని జగన్ చెప్పడంతో ఓ మంత్రి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. మీరు ఇలా కట్టడి చేస్తే కేడర్ కు సమాధానం చెప్పలేకపోతున్నట్లు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే మరోమంత్రి లేచి తన అసహనాన్ని బయటపెట్టారు. తాము తమరికి భయపడుతున్నామని కానీ అధికారులు మాత్రం తమను పట్టించుకోవడం లేదని తమకు విలువ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. 

అధికారులను ఎలా కట్టడి చేయాలో తనకు తెలుసునని ఒకవేళ వారు తప్పులు చేస్తే మంత్రులు వారిపై చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. అనంతరం సమావేశాన్ని సీఎం జగన్ ముగించారు. ఇకపోతే మద్యపాన నిషేధం విషయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ జగన్ ను నిలదీశారు. 

మద్యపాన నిషేధం వల్ల టూరిజంకు దెబ్బ అంటూ చెప్పుకొచ్చారు. టూరిజం కోసం ఆలోచించ వద్దని అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయని కానీ సమాజం కోసం మాత్రమే ఆలోచించాలంటూ జగన్ వార్నింగ్ ఇచ్చారు. 

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నవ్వుతూ మంత్రులు తమ మనసులోని మాటలు చెప్పేశారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ మంత్రులను డమ్మీలుగా చేసి అధికారాలను తన దగ్గరే ఉంచుకున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. 

మంత్రులు నామ్ కే వాస్తే అని తెలియడంతోనే అధికారులు కనీసం విలువ ఇవ్వడం లేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారి విమర్శలకు అనుగుణంగా మంత్రులు జగన్ ను నిలదీయడంతో మంత్రులు ఎంత అసహనంతో ఉన్నారో తెలుస్తోంది. 

ఇకపోతే తాము సీఎంకు భయపడుతున్నామని చెప్తూనే అధికారులు తమ మాట వినడం లేదని చెప్పుకొచ్చారు. అంటే మంత్రులను జగన్ భయపెడుతున్నారా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. జగన్ కేబినెట్ లో ఎక్కువ మంది డమ్మీలే అంటూ వస్తున్న ప్రచారానికి ఊతమిచ్చేలా మంత్రులు వ్యాఖ్యలు చేయడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

మంత్రుల  సమావేశంలో జగన్ ఎదుటే మంత్రులు నవ్వుతూ తన మనసులో మాట భయటపెట్టారు. అయితే వారి మనోభవాలను సీఎం జగన్ ఎలా అర్థం చేసుకుంటారోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మంత్రులకు మీ పదవులు రెండున్నరేళ్లేనని కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. 
 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన మంత్రి అవంతి శ్రీనివాస్: గట్టిగా చెప్పిన సీఎం

click me!