సీఎం జగన్ ఆదేశిస్తే రాజీనామా చేస్తాం: రఘురామ కీలక ప్రకటన

By Siva KodatiFirst Published Jul 20, 2021, 4:48 PM IST
Highlights

ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం జగన్ ఆదేశిస్తే ఎంపీలంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. పార్లమెంట్‌లో తొలిసారి వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని గొంతెత్తారని గుర్తుచేశారు.

విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని.. అయితే అక్కడ విచారణ జరిపించలేదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై అధికారులతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో మంగళవారం రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నారు. ఉత్తరాంధ్రకు సీమ నుంచి తరలి వచ్చిన వారు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు.

ప్రత్యేక హోదాపై సీఎం ఆదేశిస్తే ఎంపీలంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్లమెంట్‌లో తొలిసారి వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని గొంతెత్తారని గుర్తుచేశారు. బెయిల్ రద్దు చేయమని కోర్టును ఆశ్రయించడం రాజద్రోహం ఎలా అవుతుందో చెప్పాలని రఘురామ డిమాండ్ చేశారు.  తన వాట్సాప్‌ చాటింగ్ బయట పెట్టాలంటున్నారని .. అయితే తాను సందేశం పంపించినంత మాత్రాన అది రాజద్రోహం ఎలా అవుతుందని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.  

ALsp Read:చిరు, పవన్ కన్నా నాకే క్రేజ్ ఎక్కువ.. రఘురామ సెటైర్లు..!

అంతకుముందు ఏపీకి ప్రత్యేక హోదా విషయమై వైసీపీ ఎంపీలు  మంగళవారం నాడు ఆందోళనకు దిగారు. అయితే రాజ్యసభలో కరోనాపై చర్చకు రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు అంగీకరించారు. కరోనాపై ప్రధాని ప్రజెంటేషన్ కంటే ముందే చర్చకు వెంకయ్యనాయుడు అనుమతించారు. మధ్యాహ్నం 1 గంటకు కరోనాపై చర్చ ప్రారంభించే సమయంలో వైసీపీ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదాపై నిరసనకు దిగారు. రాజ్యసభ వెల్‌లోకి వచ్చి ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. 

click me!