వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు: సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్

By narsimha lode  |  First Published May 26, 2021, 11:19 AM IST

సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుండి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  బుధవారం నాడు డిశ్చార్జ్ అయ్యారు. 



హైదరాబాద్:  సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుండి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  బుధవారం నాడు డిశ్చార్జ్ అయ్యారు. ఆర్మీ ఆసుపత్రి నుండి ఆయన నేరుగా హైద్రాబాద్ లోని తన ఇంటికి వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పటి నుండి ఆయన అదే ఆసుపత్రిలోనే చికిత్స తీసుకొంటున్నారు. 

రాజద్రోహం కేసులు రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు రఘురామకృష్ణంరాజును కోరింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో ఈ నెల 14వ తేదీన రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం హైద్రాబాద్ నుండి ఆయనను విజయవాడకు తరలించారు. 

Latest Videos

also read:రఘురామకృష్ణంరాజు కొడుకు భరత్ పిటిషన్: సీబీఐ, కేంద్రప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

విచారణ సమయంలో సీఐడీ పోలీసులు తనను కొట్టారని రఘురామకృష్ణంరాజు విజయవాడ కోర్టుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఈ విషయమై సుప్రీంకోర్టులో రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి రిపోర్టు పంపాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించి సుప్రీంకోర్టు పంపిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే  తన తండ్రిని కొట్టిన విషయంలో  సీబీఐతో విచారణ చేయించాలని సుప్రీంకోర్టు రఘురామకృష్ణంరాజు కొడుకు భరత్ దాఖలు చేసిన పిటిషన్ పై  సుప్రీంకోర్టు మంగళవారంనాడు విచారణ చేసింది. ఈ పిటిషన్ పై విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. 

click me!