జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తి.. జిల్లా జైలుకు రఘురామకృష్ణంరాజు

Siva Kodati |  
Published : May 16, 2021, 04:09 PM ISTUpdated : May 16, 2021, 05:53 PM IST
జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తి.. జిల్లా జైలుకు రఘురామకృష్ణంరాజు

సారాంశం

ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు కొన్ని వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై అరెస్ట్ అయి ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు జైలుకు తరలించారు.

ఇప్పటికే ఆయన వైద్య చికిత్సలు పూర్తవ్వడంతో వైద్యుల అనుమతితో జీజీహెచ్ నుంచి గుంటూరు జిల్లా జైలుకు రఘురామను తరలిస్తున్నారు సీఐడీ పోలీసులు. ఈ సందర్భంగా జైలు ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. 

వైద్య పరీక్షల ఆధారంగా నిపుణుల కమిటీ నివేదికను సిద్దం చేస్తోంది.  నివేదికను హైకోర్టుకు వైద్య నిపుణుల కమిటీ సమర్పించనుంది. నివేదికలో ఏముంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ ముందుకు సాగనుంది

Also Read:రఘురామకృష్ణంరాజుకి పూర్తైన వైద్య పరీక్షలు: ఎఫ్ఐఆర్‌లో మీడియా చానెల్స్ పేరు

ఈ కేసులో ఆయనపై 12/2021 నమోదు చేశారు.  అంతేకాదు ఈ కేసులో ఏ-1గా రఘురామకృష్ణరాజు,  ఏ- 2గా టీవీ5,  ఏ- 3గా ఏబీఎన్‌ ఛానల్‌ను సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు.

రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. ఇది ఇలా ఉండగా ఎంపీ రఘురామకృష్ణరాజుకు సీబీసీఐడీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 28 వరకు రిమాండ్‌కు  కోర్టు అనుమతి ఇచ్చింది. 
 
PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్