ప్రభుత్వం చేతులెత్తేసింది.. మీకు మీరే కాపాడుకోండి: ప్రజలకు అయ్యన్న విజ్ఞప్తి

By Siva Kodati  |  First Published May 16, 2021, 3:27 PM IST

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైనందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ఆదివారం నర్సీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన... నెలాఖరు వరకైనా రాష్ట్రంలో లాక్‌డౌన్  విధిస్తే పాజిటివ్ రేటు తగ్గే అవకాశం ఉంటుందన్న సంగతిని  సీఎం ఆలోచించాలని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు


కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైనందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ఆదివారం నర్సీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన... నెలాఖరు వరకైనా రాష్ట్రంలో లాక్‌డౌన్  విధిస్తే పాజిటివ్ రేటు తగ్గే అవకాశం ఉంటుందన్న సంగతిని  సీఎం ఆలోచించాలని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.

గ్రామాల్లో ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌లు విధించుకుని పాజిటివ్ రేటు తగ్గించేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని టీడీపీ నేత పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో సోమవారం నుండి విధించిన లాక్‌డౌన్‌‌కు అందరూ సహకరించాలని అయ్యన్న కోరారు.

Latest Videos

undefined

Also Read:ఏపీలో తగ్గని కరోనా తీవ్రత: కొత్తగా 22,018 కేసులు.. తూర్పోగోదావరిలో పైపైకి

లాక్‌డౌన్‌ సమయాల్లో దినసరి కార్మికుల జీవనోపాధిపై ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపాలిటీ నిధులతో వీరికి భోజన సదుపాయం కల్పించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. వైన్ షాపులు కరోనా వ్యాప్తికి కేంద్రాలుగా మారాయని.. వీటిని ఇంటింటికి తిరిగి అమ్మే ఏర్పాటును పరిశీలించాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.

కరోనా వల్ల చనిపోయిన మృతదేహాలను దహనం చేసే బాధ్యత మున్సిపాలిటీ తీసుకోవాలని ఆయన కోరారు. రైతుల పంటలు ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకునేలా మంత్రి చర్యలు తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. 

click me!