ఆర్ఆర్ఆర్ చూశా.. కళ్లు చెదిరిపోయాయి: రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్‌లపై రఘురామ ప్రశంసలు

Siva Kodati |  
Published : Mar 27, 2022, 04:00 PM IST
ఆర్ఆర్ఆర్ చూశా.. కళ్లు చెదిరిపోయాయి: రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్‌లపై రఘురామ ప్రశంసలు

సారాంశం

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకు మంచి ఓపినింగ్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సినిమాను వీక్షించి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.

మరోసారి తెలుగుసినిమా దమ్మేంటో చాటిచెబుతూ దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుదిరం) (raudram ranam rudiram) హిట్ టాక్ తో దూసుకుపోతోంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి వుందంటూ థియేటర్ల వద్ద మెగా, నందమూరి అభిమానులు సందడి చేస్తున్నారు. ఇక సినిమాకు హిట్ టాక్ రావడంతో సీనీ, రాజకీయ ప్రముఖులు RRR టీం కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

తాజాగా, నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించారు. తన స్పందనను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. "ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను. కళ్లు చెదిరిపోయాయంటే అతిశయోక్తి కాదు. భీమ్ పాత్రలో ఎన్టీఆర్, రామ్ గా రామ్ చరణ్ అద్భుతమైన నటన కనబర్చారు. వెండితెరపై కథను చెప్పడంలో తనకు తిరుగులేదని రాజమౌళి మరోసారి నిరూపించుకున్నారు. ఇంతటి భారీ విజయాన్ని సాధించిన యావత్ చిత్రబృందానికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు. 

అంతేకాదు, గతంలో తాను ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో వేరువేరుగా దిగిన ఫొటోలను రఘురామ పంచుకున్నారు. అలాగే నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రామ్ చరణ్ కు మరో ట్వీట్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు రఘురామ. ఇక కొద్దిరోజుల క్రితం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ (nara lokesh) కూడా RRR హీరోలు, డైరెక్టర్ తో పాటు యూనిట్ మొత్తానికి సోషల్ మీడియా వేధికన శుభాకాంక్షలు తెలిపారు.

RRR సినిమాకు మంచి రివ్యూస్ వస్తున్నాయి. దీన్నిబట్టే ఈ సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఇలా మరో అద్భుత విజయాన్ని అందుకున్న స్టార్ హీరోలు తారక్ (జూనియర్ ఎన్టీఆర్), రామ్ చరణ్ తేజ్ (ramcharantej), మ్యాస్ట్రో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో పాటు సినిమా యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు. మీరంతా కలిసి  ఓ అద్భుతమమైన సినిమాను అందించారు'' అని  లోకేష్ అన్నారు. ''RRR మూవీకి వస్తున్న స్పందన చూస్తుంటే వెంటనే సినిమా చూడాలని వుంది. తప్పకుండా ఈ వారమే కుటుంబంతో కలిసి సినిమాను చూస్తాను. ఈ మూవీ రికార్డులన్నింటిని బద్దలుకొట్టాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ గయ్స్'' అంటూ RRR పవర్ ఫుల్ పోస్టర్ ను జతచేసి లోకేష్ ట్వీట్ చేసారు.

PREV
click me!

Recommended Stories

రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu