ఆవిర్భావ దినోత్సవాల వేళ.. సత్తెనపల్లి టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Mar 27, 2022, 03:25 PM IST
ఆవిర్భావ దినోత్సవాల వేళ.. సత్తెనపల్లి టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు, ఉద్రిక్తత

సారాంశం

ఆవిర్భావ దినోత్సవాల వేళ గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఒక వర్గం ఏర్పాటు చేసిన టెంట్లను , మరో వర్గం వారు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత పరిస్ధితులు ఏర్పడ్డాయి. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. 

గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీలో వర్గ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ నెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తుండగా .. పార్టీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాట మాట పెరగడంతో ఘర్షణ జరిగింది. ఒక వర్గం ఏర్పాటు చేసిన టెంట్లను , మరో వర్గం వారు ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. 

కాగా.. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు (tdp 40 years celebrations) పూర్తి చేసుకుని 41వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహించనుంది.  టీడీపీ ఆవిర్భావ దినోత్సమైన మార్చి 29వ తేదీ నాడు వాడవాడల్లో పలు కార్యక్రమాలు జరిపేందుకు పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నలభై వసంతాల పార్టీ ఆవిర్భావ వేడుకల లోగోను టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu naidu) ఆవిష్కరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెలుగు వారికి గుర్తింపు లేనప్పుడు టీడీపీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. 

రూ. 2కే కిలో బియ్యం ద్వారా ఆహార భద్రత, పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు తెలుగుదేశం పాలనలో అందాయని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ఆ పథకాలే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బిసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చింది టీడీపీనే అని, అనేక సామాజిక మార్పులకు టిడిపి ఆవిర్భావం కారణమైందని చంద్రబాబు అన్నారు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశమే అని, జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ తనదైన ముద్ర వేసిందని గుర్తుచేశారు. 

టీడీపీ నలభై వసంతాల ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆ రోజున గ్రామ గ్రామాన టీడీపీ ఆవిర్భావ వేడుకలు, జెండా ఆవిష్కరణలు చేపట్టాలని ఆయన క్యాడర్‌కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఆవిర్భావ వేడుకలు ఉండాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రానికి టీడీపీ అవసరమేంటో ప్రజలకు వివరించాలని క్యాడర్‌ను ఆయన ఆదేశించారు. హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నాడు ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన ప్రాంతాన్ని సందర్శిస్తామన్నారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పిస్తామని చంద్రబాబు వెల్లడించారు. 

అనంతరం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ లో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాలకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులంతా వస్తారని చంద్రబాబు చెప్పారు. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలపై చంద్రబాబు స్పందించారు. కల్తీ మద్యం వల్ల అంతమంది చనిపోతే కనీసం చర్చ ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మద్యమైనా జగన్ (ys jagan) కనుసన్నల్లోనే సరఫరా అవుతుందని ఆయన ఆరోపించారు. కొన్ని బ్రాండ్ల మద్యం ఏపీలో కన్పించకుండా పోవడడానికి కారణాలు ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. కిళ్లీ కొట్టులో కూడా ఆన్‌లైన్ పేమెంట్లు ఉంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆన్‌లైన్ పేమెంట్లు ఎందుకు ఉండవని ఆయన నిలదీశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో తుపాను... ఇక తెలంగాణ, ఏపీలో జరిగేది ఇదే..!
Sajjala Ramakrishna Reddy Sensational Comments On Chandrababu | Asianet News Telugu