జగన్‌కు షాక్.. ఆయన బెయిల్ రద్దు చేయండి: హైకోర్టులో రఘురామకృష్ణం రాజు పిటిషన్

By Siva KodatiFirst Published Apr 6, 2021, 2:40 PM IST
Highlights

సొంత పార్టీపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా ఒంటికాలిపై లేచే నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ కోర్టులో ఏ-1గా ఉన్న ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌‌ను రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

జగన్మోహన్‌రెడ్డి 11 సీబీఐ ఛార్జిషీట్లలో ఏ-1గా ఉన్నారని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే పిటిషన్ వేసినట్టు ఎంపీ తెలిపారు. 

ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణంరాజు.. ఇన్ని ఛార్జిషీట్లు వేసినా... ట్రయల్ ఆలస్యంగా జరుగుతోందని ఆరోపించారు. కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని, ఆయన త్వరగా కేసుల నుంచి బటయపడాలనే ఈ కేసు వేశానని చెప్పారు.

త్వరగా కేసు తేలిపోతుందని నమ్ముతున్నానని తెలిపారు. ప్రత్యర్థులు నానా రకాలుగా మాట్లాడటం బాధాకరమని, వారికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే హైకోర్టును ఆశ్రయించినట్లు రఘురామకృష్ణంరాజు చెప్పారు.

కోర్టుకు వెళ్లకపోవడం... అనుమానించే విధంగా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలని, జయలలిత, లాలూ తదితరులు తమ స్థానంలో వేరే వారికి సీఎంగా ఛాన్స్ ఇచ్చినట్టే జగన్ కూడా వేరొకరికి అవకాశమిచ్చి.. కేసుల నుంచి బయటపడాలని ఎంపీ హితవు పలికారు. 
 
click me!