తాగుబోతులకు వకాల్తా పుచ్చుకున్న టీడీపీ.. రాష్ట్రాన్ని నాశనం చేశారు.. మంత్రి కన్నబాబు ఫైర్

By telugu teamFirst Published Oct 14, 2021, 7:26 PM IST
Highlights

మద్యం అలవాటును చెరిపేయడానికే తమ ప్రభుత్వం ధరలు పెంచిందని మంత్రి కన్నబాబు అన్నారు. కానీ, టీడీపీ మాత్రం తాగుబోతులకు వకాల్తా పుచ్చుకుని అవాకులు, చెవాకులు పేలుతున్నదని ఆగ్రహించారు. టీడీపీ హయాంలో అప్పులు చేయలేదని అని అడిగారు. దీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా చేసిన యనమల రామకృష్ణుడు ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని అన్నారు. చంద్రబాబు నాయుడు, యనమలలు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు.
 

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ Minister Kanna Babu కన్నబాబు టీడీపీపై ఫైర్ అయ్యారు. Chandra Babu Naidu, Yanamala Ramakrushnuduలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం నాయకులు ఏం చేయాలో తెలియక అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. YCP అప్పులు చేస్తున్నదని యనమల రామకృష్ణుడు పేలుతుండటం సరికాదని అన్నారు. సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన రామకృష్ణుడు ఇలా చవుకబారు మాటలు మాట్లాడరాదని తెలిపారు. టీడీపీ హయాంలో అప్పులు చేయలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు లక్షల అప్పులు చేసినప్పుడు యనమల ఏం చేశాడని నిలదీశారు. వారిద్దరు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. మద్యం అలవాటు నుంచి ప్రజలను రక్షించడానికే రేట్లు పెంచామని వివరించారు. కానీ, దాన్ని టీడీపీ నేతలు విమర్శించారని అన్నారు. వారు తాగుబోతులకు వకాల్తా పుచ్చుకున్నారని అన్నారు.

Andhra Pradeshలో అమ్మవడి పాతదే అని TDP నాయకులు చెబుతుండటం సిగ్గు చేటు అని మండిపడ్డారు. డీబీటీ కింద వేల కోట్లు రూపాయలు ప్రజలకు అందిస్తున్నామని మంత్రి కన్నబాబు అన్నారు. డీబీటీని విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. దేశం మొత్తం విద్యుత్ కొరత ఉన్నదని, కానీ, ఈ సమస్య కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నదన్నట్టుగా టీడీపీ నేతలు మాట్లాడటం దుర్మార్గమని చెప్పారు. టీడీపీ హయాంలో విద్యుత్ కంపెనీలకు ఆర్థిక సహకారం చేయలేదని, అందువల్లనే డిస్కమ్‌లపై ప్రభావం పడిందని అన్నారు.

Also Read: కడప జిల్లాపై సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖాస్త్రం.. ‘ఆ సర్వీసులు రీస్టార్ట్ చేయండి’

రైతులను మోసం చేసిన టీడీపీదేనని మంత్రి కన్నబాబు ఆరోపించారు. చంద్రబాబు నాయుడి అనుభవం ఆయనను నమ్ముకున్నవాళ్లకే పనికి వచ్చిందని విమర్శించారు. కానీ, జగన్‌మోహన్ రెడ్డి మనసున్న నాయకుడని తెలిపారు. పేదల కష్టాలు తెలిసిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు.

టీడీపీ నేతలు ఆర్థిక నేరాలు బయట పడకూడదనే నలుగురు ఎంపీలను బీజేపీకి అప్పగించారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. అప్పులను దుబారా చేసిన ఘనత కూడా టీడీపీదేనని అన్నారు. ఆలయ భూములను ఆక్రమిస్తే ఊరుకోమని హెచ్చరించారు. 31 లక్షల మంది అర్హులకు గృహాలు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. టీడీపీ కావాలనే ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను అడ్డుకుంటున్నదని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇల్ల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రిస్తామని వివరించారు. ధరలను అదుపులో ఉంచేందుకే రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని తెలిపారు.

click me!