ఏవోబీలో ఆరుగురు కీలక మావోల లొంగుబాటు: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

By narsimha lodeFirst Published Aug 12, 2021, 1:58 PM IST
Highlights

 ఏవోబీలో ఆరుగురు కీలక మావోయిస్టులు లొంగిపోయారని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. ఆదీవాసీల మద్దతు మావోయిస్టులకు లేకుండా పోయిందన్నారు. మిలిసీయా సభ్యులు కూడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడం వల్లే మావోయిస్టులకు ఆదీవాసీల నుండి మద్దతు లభించడం లేదన్నారు.
 

అమరావతి: ఏవోబీలో ఆరుగురు కీలక మావోయిస్టులు లొంగిపోయారని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.గురువారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం లోకల్ సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. గాదర్ల రవి తమకు సరెండయ్యారన్నారు.

ఏవోబీలోని బేస్ ఏరియాలో మిలిషీయా కేడర్ కూడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం నుండి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. 

also read:ఏపీలో మావోలకు ఎదురుదెబ్బ: ఆర్కే గన్‌మెన్ సహా ఆరుగురు నక్సల్స్ అరెస్ట్

మావోయిస్టులు అనుసరించే పద్దతుల ద్వారా సమస్యలు పరిష్కారం కావని ఆదీవాసీలు అర్ధం చేసుకొన్నారని డీజీపీ చెప్పారు.  ఏజెన్సీలో భూ సమస్యలు తగ్గిపోయిందన్నారు. పట్టాలు ఇవ్వడం వల్ల ఈ సమస్య పరిష్కారం అయిందన్నారు.

గిరిజనుల నుండి మావోయిస్టులకు మద్దతు లభించడం లేదన్నారు.  గిరిజన ప్రాంతంలో 20 వేల మందికి ప్రభుత్వం భూమి పట్టాలను ఇచ్చిందని ఆయన చెప్పారు.  గత నెలలో మావోయిస్టు కీలక నేత ఒకరు లొంగిపోయాడన్నారు. ఆయన కొంత సమాచారం ఇచ్చినట్టుగా చెప్పారు. ఇవాళ డివిజనల్ కమాండర్, ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు సహా మరో ముగ్గురు లొంగిపోయారని ఆయన చెప్పారు.


 

click me!