కాళ్ల నిండా గాయాలు.. పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి రఘురామరాజు ఫిర్యాదు

By Siva Kodati  |  First Published May 15, 2021, 6:09 PM IST

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ కార్యాలయం నుంచి కోర్టుకు వచ్చిన ఆయన కాళ్లకు గాయాలు కనిపించాయి. విచారణ సమయంలో తనను పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 


వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ కార్యాలయం నుంచి కోర్టుకు వచ్చిన ఆయన కాళ్లకు గాయాలు కనిపించాయి. విచారణ సమయంలో తనను పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

అంతకుముందు రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు గుంటూరులోని ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అంతకుముందు సీఐడీ కార్యాలయంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. 

Latest Videos

ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిప్పిపంపారు. మరోవైపు ఆయన తరపు న్యాయవాది ఆదినారాయణరావు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరికాసేపట్లో డివిజన్ బెంచ్‌లో విచారణ జరగనుంది. 

ఇదిలా ఉండగా, కోర్టుకు వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకుంటున్నారని రఘురామ తరఫు లాయర్లు తెలిపారు. పబ్లిక్ కోర్టులోకి వెళ్లేందుకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని లాయర్ గోపినాథ్ ఆరోపించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు

మరోవైపు రఘురామకృష్ణంరాజుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. నేరుగా తమ వద్దకు రావడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. బెయిల్ కోసం తొలుత సెషన్స్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. దీనిపై దాదాపు 45 నిమిషాల పాటు హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి.

Also Read:బెయిల్ పిటిషన్: రఘురామ కృష్ణమరాజుకు హైకోర్టు షాక్

సెషన్స్ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేయాలని హైకోర్టు సూచించింది. రఘురామ కృష్ణమరాజు వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు. రఘురామకృష్ణమ రాజు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు కోవిడ్ వచ్చే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో కోవిడ్ నిబంధనల మేరకు రఘురామకృష్ణమ రాజును విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రస్తుత పరిస్థితిలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. 

గతంలో ఓ యూనివర్శిటీ వీసీ నేరుగా హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయినప్పటికీ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారు కాబట్టి హైకోర్టుకు వచ్చామని రఘురామకృష్ణమ రాజు న్యాయవాది చెప్పారు. కుట్రపూరితంగా సిఐడి కేసు నమోదు చేసిందని, ఆధారాలు లేకుండా ఓ ఎంపీని అరెస్టు చేయడం సరి కాదని రఘురామకృష్ణమ రాజు న్యాయవాది అన్నారు. 

 

"

click me!