ఆంధ్రప్రదేశ్‌లో వైసీసీ, టీడీపీలకు చెందిన నాయకులు మధ్య మాటల యుద్దం ఓ రేంజ్‌లో కొనసాగుతూనే ఉంటుంది. అయితే వైసీపీకి చెందిన ఓ ఎంపీ టీడీడీ ఎంపీలతో కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీసీ, టీడీపీలకు చెందిన నాయకులు మధ్య మాటల యుద్దం ఓ రేంజ్‌లో కొనసాగుతూనే ఉంటుంది. అయితే వైసీపీకి చెందిన ఓ ఎంపీ టీడీడీ ఎంపీలతో కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇంట్లో విందుకు పలు పార్టీలకు చెందిన ఎంపీలతో కలిసి వైసీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను విందుకు హాజరైన ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే షేర్ చేశారు. థాంక్యూ నాని అని పేర్కొన్నారు.
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘తోటి ఎంపీలను కలవడం మరియు కలుసుకోవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ధన్యవాదాలు కేశినేని నాని. మంచి ఆంధ్ర భోజనం కోసం మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు’’ అని గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని కేశినేని నివాసంలో జరిగిన ఈ విందుకు హాజరైన వారిలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకేకు చెందిన ఎంపీలు కనిమొళి, తమిజాచ్చి తంగపాండియన్, కథిర్ ఆనంద్, శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే, టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.
అయితే టీడీపీ ఎంపీలతో కలిసి వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కనిపించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ మారుతారా..? అనే చర్చ సాగుతుంది. అయితే సాధారణంగా ఢిల్లీలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు కలుసుకోవడం పెద్ద విషయేమి కాదు. కానీ వైసీపీ ఎంపీలు.. టీడీపీ ఎంపీలను కలవడం చిన్న విషమేమి కాదనే చెప్పాలి. వైసీపీ ఎంపీలకు ఢిల్లీలో ఇతర పార్టీల నేతలతో కలవాలంటే పార్టీ ముఖ్యుల నుంచి అనుమతి తప్పనిసరి అని రాజకీయ వర్గాల నుంచి విపించే మాట. వైపీపీ ఎంపీలపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నిఘా ఉంటుందని చెబుతారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. టీడీపీ ఎంపీ ఇంటికి విందుకు హాజరవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై ఆయన వైసీపీ ముఖ్యల నుంచి అనుమతి తీసుకున్నారా?.. లేక తన ఇష్టపూర్వకంగానే వెళ్లి కలిశారా అనేది తెలియాల్సి ఉంది. అయితే వైసీపీ ముఖ్యల నుంచి అనుమతి తీసుకోకుంటే మాత్రం.. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో అంతర్గతంగా చర్చ సాగుతుంది. లావు శ్రీకృష్ణదేవరాయలు.. టీడీపీ ఎంపీలను కలవడంపై పలువురు వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇలాంటి చర్యలు నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల స్థైర్యాన్ని దెబ్బతిస్తాయని వారు చెబుతున్నారు.
Always to pleasure to meet with the fellow MPs and catch up. Thank you for hosting us for an authentic Andhra lunch. pic.twitter.com/HBI9EOdHTt
— Jay Galla (@JayGalla)
అయితే ఈ విందుకు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు కూడా హాజరైనందున దీనిని ఆత్మీయ విందుగా మాత్రమే చూడాల్సి ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఓ వర్గం మాత్రం లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళ్లే అవకాశం లేకపోలేదని అంటుంది. లావు శ్రీకృష్ణదేవరాయలకు వివాదరహితునిగా మంచి పేరు ఉంది. ఆయన అమరావతి రైతులకు సంఘీభావం తెలుపడం గతంలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.
ఇక, తన పార్లమెంట్ నియోజకర్గంలోని వైసీపీ ఎమ్మెల్యేలతో ఆయనకు సఖ్యత లేదన్నది బహిరంగ రహస్యమే. చిలకలూరిపేట ఎమ్మెల్యే, మంత్రి విడదల రజిని, వినుకొండకు చెందిన బోళ్ల బ్రహ్మ నాయుడుతో ఆయనకు నిత్యం విబేధాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానంపై లావు శ్రీకృష్ణదేవరాయలు అసంతృప్తితో ఉన్నారనే చర్చ కొంతకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మరి నిజంగానే లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి జంప్ అవుతారో లేదో వేచిచూడాల్సి ఉంది.