కర్నూలు ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదం.. లారీ, కారు ఢీ, ముగ్గురు మృతి..

Published : Jul 27, 2022, 09:05 AM IST
కర్నూలు ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదం.. లారీ, కారు ఢీ, ముగ్గురు మృతి..

సారాంశం

కర్నూలు ఔటర్ రింగ్ రోడ్డులో ఓ లారీ, కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు సమీపంలో ఘోర road accident సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారు kurnool ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు సమీపంలో ఔటర్ రింగు రోడ్డుపై ఈ ప్రమాదం సంభవించింది. లారీ, కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మరణించినవారు రాయదుర్గం ప్రాంతానికి చెందినవారిగా భావిస్తున్నారు. మరణించినవారిని గణేష్, రుద్ర, సోమశేర్ లుగా గుర్తించారు.

ఇదిలా ఉండగా, జూలై 18న నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాల్కొండ మండలం కిసాన్ సాగర్ సమీపంలో 44వ నబంరు జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ బాధితుడిని నిర్మల్ స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హైవే మీద రోడ్డు ప్రమాదం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ వాహనాలను బాల్కొండ మీదుగా మళ్లిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, జూన్ 30న ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు.. లారీ,  ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇరవై మందికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన బాధితులను దగ్గర్లోని కుంబం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. 

కోనసీమ జిల్లాలో జగన్ పర్యటన... వరద బాధితులకు ఓదార్పు

కాగా, లారీని ఢీకొన్న బస్సు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో  జాతీయ రహదారి మీద రెండు వైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో, అధికారులు బస్సును క్రేన్ సహాయంతో  తొలగిస్తున్నారు. బస్సు విజయవాడ నుంచి అనంతపురం వెళుతుండగా  ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

కాగా, జూన్ 27న నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు క్రాస్ రోడ్డు వద్ద ఇలాంటి రోడ్డు ప్రమాదమే జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ఆగి ఉన్న ఒక లారీని వెనకనుండి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఢీ కొట్టిన ధాటికి వెంటనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో, కారులో ఉన్న ఇద్దరు బైటికి రాలేక చిక్కుకుపోయి అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులిద్దరినీ జగిత్యాల జిల్లా వాసులుగా గుర్తించారు. 

మరోవైపు, జూన్ 25న నంద్యాలలో ఇలాంటి రోడ్డు ప్రమాదమే జరిగింది. ఈ ప్రమాదంలో నవవరుడు మృతి చెందాడు. దీంతో నంద్యాల జిల్లా వెలుగోడు మండలం పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన కొన్ని గంటలకే నవ వరుడు శివకుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన జూన్ 25, శనివారం తెల్లవారుజామున జరిగింది. ఆ సమయంలో అతను రోడ్డు మీద వెడుతుండగా వెలుగోడు మండలంలోని మోత్కూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో శివకుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

PREV
click me!

Recommended Stories

దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli