చంద్రబాబుతో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు భేటీ .. త్వరలో టీడీపీలోకి

Siva Kodati |  
Published : Feb 27, 2024, 08:16 PM ISTUpdated : Feb 27, 2024, 08:17 PM IST
చంద్రబాబుతో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు భేటీ .. త్వరలో టీడీపీలోకి

సారాంశం

వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు టీడీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆయన టీడీపీ అధినేతతో భేటీ అయ్యారు. మరోసారి బరిలోకి దిగాలని శ్రీకృష్ణదేవరాయులు భావించారు. అయితే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ టికెట్ నిరాకరించి.. బీసీ నేత అయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు టికెట్ కన్ఫర్మ్ చేశారు. 

వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు టీడీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆయన టీడీపీ అధినేతతో భేటీ అయ్యారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన శ్రీకృష్ణదేవరాయులు .. టీడీపీలో చేరుతానని చెప్పారు. చంద్రబాబుతో భేటీ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిక, నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ, తదితర అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. కాగా.. నరసరావుపేట సిట్టింగ్ స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగాలని శ్రీకృష్ణదేవరాయులు భావించారు. అయితే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ టికెట్ నిరాకరించి.. బీసీ నేత అయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు టికెట్ కన్ఫర్మ్ చేశారు. 

బీసీ నేతగా, మంచి వాగ్ధాటి కలిగిన నాయకుడిగా వైసీపీలో అనిల్ కుమార్ యాదవ్‌కు పేరుంది. సామాజిక , ఆర్ధిక అంశాలను లెక్కలో వేసుకుని జగన్ ఆయన అభ్యర్ధిత్వానికి ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. నెల్లూరు సిటీ నుంచి మరోసారి అసెంబ్లీకి పోటీ చేస్తానన్నా జగన్ కాదనే అవకాశం లేదు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, జగన్ ఇమేజ్ తనకు విజయాన్ని కట్టబెడతాయని అనిల్ గట్టి నమ్మకంతో వున్నారు. నెల్లూరు సిటీయే కాదు, నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసినా తనకు గెలుపు గ్యారంటీ అని ఆయన భావిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cordon and Search Operation in Nellore: రౌడీలకు మందు బాబులకు చుక్కలే | Police | Asianet News Telugu
రైతులకు పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ చేసిన Minister Anam Ramanarayana Reddy | Asianet News Telugu