వైసీపీతో నాకు సంబంధం లేదు .. త్వరలోనే బీజేపీలో చేరతా : కాపు రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Feb 27, 2024, 5:12 PM IST

వైసీపీ సీనియర్ నేత, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. తాను ఎప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యేది తర్వాత తెలియజేస్తానని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తాను‌ వైసీపీని పూర్తిగా వదిలేశానని ఆ పార్టీ తో నాకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.


వైసీపీ సీనియర్ నేత, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన బీజేపీ సమావేశానికి వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆయన కలిశారు. అనంతరం రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజనాథ్ సింగ్ ను కలిసేందుకే వచ్చానని తెలిపారు. మా జిల్లాకు సంబంధం లేని మీటింగ్ ఇక్కడ జరుగుతుందని.. అందుకే మీటింగ్‌లో నుంచి బయటికి వచ్చేసానని వెల్లడించారు. తాను ఎప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యేది తర్వాత తెలియజేస్తానని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 

ప్రస్తుతానికి పూర్తిగా ఏ నిర్ణయం తీసుకోలేదని , తాను‌ వైసీపీని పూర్తిగా వదిలేశానని ఆ పార్టీ తో నాకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేస్తున్నానని.. ఏ పార్టీ అనేది త్వరలో చెబుతానని రామచంద్రారెడ్డి తెలిపారు. వైసీపీ మీటింగ్ నుంచి తనకు ఎటువంటి సమాచారం లేదని వెల్లడించారు. రాజ్‌నాథ్ సింగ్‌ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చానని, త్వరలోనే అన్ని విషయాలు వివరిస్తానని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 

Latest Videos

కాగా.. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట వున్నారు కాపు రామచంద్రారెడ్డి. అలాగే జగన్ కూడా ఆయనకు అంతే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రారెడ్డికి టికెట్ నిరాకరించారు జగన్. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనను నమ్మించి గొంతు కోశారని, ఏ పార్టీ టికెట్ ఇస్తే అందులో చేరతానని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిస్తే.. ఇరు పార్టీల మద్ధతుతో బీజేపీ నుంచి గెలవొచ్చని రామచంద్రారెడ్డి భావిస్తున్నారు. 
 

click me!