ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ తన నివాసంలో బస చేశారంటూ వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామకృష్ణంరాజు. తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు.
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాన్ పలువురు రాజకీయ నేతలను కలిశారు. అయితే ఢిల్లీలో ఉన్న రెండురోజులు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు నివాసంలో బస చేశారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ తన నివాసంలో బస చేశారంటూ వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామకృష్ణంరాజు. తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లారో తనకు తెలియదన్నారు. టీవీలలో చూసి మాత్రమే తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తనకు బాగా తెలుసునన్నారు. మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పుకొచ్చారు.
తాను పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చారు. గతంలో చిరంజీవిని కూడా అభిమానించేవాడినన్నారు. చిరంజీవికి తనకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రత్యర్థిగా మారారని తెలిపారు. ఆయన తన లోక్ సభ నియోజకవర్గం నుంచే పోటీ చేశారని, ఆయన సోదరుడు నాగబాబు తనపై పోటీ చేశారన్నారు. అది అంతటి వరకేనన్నారు.
ఏపీ రాజకీయాల్లో సంచలనం: జగన్ చెంతకు ముగ్గురు మిత్రులు, ఆ హామీపైనే వెయిటింగ్
ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు తాను షెల్టర్ ఇవ్వలేదన్నారు. ఆ అవసరం కూడా రాదన్నారు. ఇకపోతే బీజేపీతో జనసేన కలిసే అవకాశం లేకపోలేదన్నారు. ఏపీలో జనసేనకు ఓటు బ్యాంకు ఉందని చెప్పుకొచ్చారు. బీజేపీకి అంతగా ఓటు బ్యాంకులేదన్నారు.
ఏపీలో బీజేపీ ఒంటరిగా ఏమీ చేయలేదని అలాంటి తరుణంలో జనసేనతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లైనా సాధించే అవకాశం ఉందన్నారు రఘురామకృష్ణంరాజు. ఎన్నికలు సమీపించే సరికి అది జరిగే అవకాశం ఉందన్నారు రఘురామృష్ణంరాజు.
ఈ వార్తలు కూడా చదవండి
బీజేపీ ఆఫీసులో వైసీపీ ఎంపీ.. ఏం జరుగుతోంది..?