నారా భువనేశ్వరి, బ్రాహ్మణి దందాలన్నీ తెలుసు.. భారతి గురించి మాట్లాడితే నాలుక కోస్తాం: వైసీపీ ఎమ్మెల్సీ కల్యాణి

Siva Kodati |  
Published : Sep 04, 2022, 04:40 PM ISTUpdated : Sep 04, 2022, 04:44 PM IST
నారా భువనేశ్వరి, బ్రాహ్మణి దందాలన్నీ తెలుసు.. భారతి గురించి మాట్లాడితే నాలుక కోస్తాం: వైసీపీ ఎమ్మెల్సీ కల్యాణి

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ కల్యాణి. వైఎస్ భారతి గురించి మాట్లాడితే నాలుక కోస్తామని ఆమె హెచ్చరించారు.     

సీఎం జగన్‌కు వస్తున్న మంచిపేరును చూసి టీడీపీ ఓర్వలేకపోతోందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మీద టీడీపీ దుష్ప్రచారం చేస్తూనే వుందన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణికి సంబంధించిన అన్ని విషయాలు మాకు తెలుసునని కళ్యాణి హెచ్చరించారు. వైఎస్ భారతి గురించి ఏమైనా మాట్లాడితే నాలుక కోస్తామని ఆమె వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ భారతి ఏ రోజైనా రాజకీయాలు మాట్లాడారా అని కళ్యాణి ప్రశ్నించారు. రెండు ఎకరాలున్న చంద్రబాబు నాయుడు ఈరోజు 2 లక్షల కోట్ల ఆస్తి ఎలా సంపాదించారు.. కేవలం పాల వ్యాపారం వల్లేనంటే ఎవరైనా నమ్ముతారా అని ఆమె నిలదీశారు. దీని వెనుక భువనేశ్వరి, బ్రాహ్మణిల లిక్కర్ వ్యాపారం వుందని కళ్యాణి ఆరోపించారు.

జగన్ సీఎం అయ్యాక.. ఒక్క డిస్టిలరీకైనా అనుమతులు ఇచ్చారా అని ఆమె ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక 44 వేల బెల్ట్ షాపులు రద్దు చేశారని.. 33 శాతం మద్యం దుకాణాలను తగ్గించారని .. 4,500 పర్మిట్ రూమ్‌లను తొలగించారని కల్యాణి గుర్తుచేశారు. పర్మిట్ రూమ్‌లను చంద్రబాబు హయాంలోనే ఏర్పాటు చేశారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ మద్య నిషేధం అమలు చేస్తే.. ఆయన కడుపున పుట్టిన భువనేశ్వరి చంద్రబాబుతో కలిసి వెన్నుపోటు పొడిచారని కళ్యాణి ఆరోపించారు. లిక్కర్ సిండికేట్ నుంచి భువనేశ్వరి వందలకోట్లు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఆరోజున భువనేశ్వరి ముడుపులు తీసుకున్నారు కాబట్టే.. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చారని కల్యాణీ ఆరోపించారు. ముడుపుల కోసం భువనేశ్వరి, బ్రాహ్మణి గొడవ పడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అది నారా కుటుంబం కాదని.. సారా కుటుంబమని కల్యాణి అభివర్ణించారు. ఎస్‌పీవై రెడ్డి డిస్టలరీ నుంచి భువనేశ్వరి, బ్రాహ్మణి ఎన్ని ముడుపులు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు.
 

PREV
click me!

Recommended Stories

కదిరిలో రూ.25 కోట్ల అవినీతి | BJP Leader Vishnu Vardhan Reddy Demands Probe | Asianet News Telugu
Fire Service వారోత్సవాల్లో DGP Harish Kumar Gupta | Fire Service Vehicles | Asianet News Telugu