వివాహేతర సంబంధం : నగరిలో దారుణం.. ప్రియుడిపై మోజుతో భర్తను హతమార్చిన భార్య

Siva Kodati |  
Published : Sep 04, 2022, 03:34 PM IST
వివాహేతర సంబంధం : నగరిలో దారుణం.. ప్రియుడిపై మోజుతో భర్తను హతమార్చిన భార్య

సారాంశం

చిత్తూరు జిల్లా నగరిలోని టీఆర్ కండ్రిగలో వివాహేతర సంబంధం ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. . విచారణలో భార్య వనిత నేరాన్ని అంగీకరించిందని పోలీసులు తెలిపారు.

చిత్తూరు జిల్లా నగరిలోని టీఆర్ కండ్రిగలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది భార్య. నగరిలో విజయ్ కుమార్ అనే వ్యక్తి సెల్‌ఫోన్ షాపు నడుపుతున్నాడు. ఆయన భార్య వనితకు తమిళరసన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం వుంది. ఈ విషయంగా భార్యభర్తలకు మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో భర్త అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది వనిత. దీనిలో భాగంగా గత నెల 29న పథకం ప్రకారం.. భర్త విజయ్ కుమార్‌ను ప్రియుడితో కలిసి హతమార్చింది. విచారణలో భార్య వనిత నేరాన్ని అంగీకరించిందని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. 

కాగా.. ఇదే చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలోని దేవుల చెరువు పంచాయతీ గొల్లవారి పల్లెకు చెందిన శ్రీనివాసులు (32) ఇటీవల దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న వేణుగోపాల్, శంకర్ లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులోభర్త హత్యను  ప్రోత్సహించిన నిందితురాలు శ్రీనివాసులు భార్య శోభారాణిని కూడా పోలీసులు ఆదివారం అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇన్చార్జి సీఐ శివాంజనేయులు, ఎస్సై డివై స్వామిల కథనం మేరకు… శ్రీనివాసులు హత్య కేసులో నిందితుడైన వేణుగోపాల్… శోభారాణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 

ALso Read:వివాహేతర సంబంధం : భర్త హత్యను ప్రోత్సహించిన భార్య.. పారిపోతుండగా అరెస్ట్...

ఈ నేపథ్యంలో తమ అక్రమ సంబంధానికి ఆమె భర్త అడ్డు వస్తున్నాడని.. అతడిని హతమార్చాడానికి పథకం పన్ని.. అమలు చేశాడు. ఇందుకు భార్య శోభారాణి కూడా సహకారం అందించినట్లు తెలిపారు. శోభారాణి బెంగళూరుకు వెళ్లేందుకు ఉదయం 11 గంటల సమయంలో వేపూరికోట క్రాసులో ఉండగా సమాచారం తెలుసుకున్న ఇన్చార్జి సీఐ శివాంజనేయులు, ఎస్సై డివై స్వామీలు అదుపులోకి తీసుకుని.. అరెస్టు చేసి.. రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Reviews GSDP, RTGS & Pattadar Passbooks at AP Secretariat | Asianet News Telugu
Manchu Family Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంచు ఫ్యామిలీ | Asianet News Telugu